కుటుంబాన్నే ఎందుకు పక్కన పెట్టారంటే..?
ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కంటే భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలిసారి కేసీఆర్ తొలి మంత్రివర్గంలోనే కొడుకు కె.టి.రామారావు, అల్లుడు [more]
ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కంటే భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలిసారి కేసీఆర్ తొలి మంత్రివర్గంలోనే కొడుకు కె.టి.రామారావు, అల్లుడు [more]
ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కంటే భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలిసారి కేసీఆర్ తొలి మంత్రివర్గంలోనే కొడుకు కె.టి.రామారావు, అల్లుడు హరీశ్ రావులకు చోటు కల్పించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కుటుంబ పార్టీ అని అల్లుడు, కొడుకు కలసి రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి విన్పించాయి. ప్రధాని మోదీ సయితం కేసీఆర్ పై ఇదే విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంగతి సరేసరి.
నమ్మకస్థులకే…..
అయితే ఈసారి మంత్రివర్గంలో ఆయన తనకు అత్యంత నమ్మకస్థులకే చోటు కల్పించడం విశేషం. అంతేకాదు కొడుకు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావులకు మంత్రి పదవి ఇవ్వలేదు. దీనికి అనేక కారణాలున్నాయంటున్నారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం కేటీ రామారావును ముఖ్యమంత్రి పదవిలో కూర్చుండ బెట్టి తాను జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగే విస్తరణలో హరీశ్ రావుకు కూడా చోటు దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
భవిష్యత్తులో….
ఇప్పుడు మంత్రి పదవిని చేపట్టే వారంతా కేసీఆర్ కు నమ్మకమైన వ్యక్తులే కాకుండా కేటీఆర్ కు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. మంత్రి వర్గ విస్తరణ కూర్పులోనూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్కు ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగానే విశ్వసనీయత ఉన్న వారికే కేబినెట్ లో చోటు కల్పించారంటున్నారు. ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, ఈటల రాజేందర్, ఇంద్రకిరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ ఈ కోవలోకి చెందిన వారే. కొడుకు, అల్లుడికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఇటు విపక్షాల విమర్శల నుంచి తప్పించుకోవడమే కాకుండా ఎవరైనా మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తులు ఉంటే వారికీ కళ్లెం వేయవచ్చు.