ఆ మంత్రులు బతికిపోయారా …?

హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు తమ పదవులకు ఎసరు పెట్టేస్తాయని గులాబీ దళ అమాత్యుల్లో అలాంటి ఇలాంటి భయం ఉండేది. ఇప్పటికే నలుగురు వరకు మంత్రి పదవులు [more]

Update: 2020-12-05 09:30 GMT

హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు తమ పదవులకు ఎసరు పెట్టేస్తాయని గులాబీ దళ అమాత్యుల్లో అలాంటి ఇలాంటి భయం ఉండేది. ఇప్పటికే నలుగురు వరకు మంత్రి పదవులు కోల్పోవాలిసి వస్తుందని గులాబీ పార్టీ లో ప్రచారం సాగింది. అయితె గ్రేటర్ ఎన్నికలు పూర్తి అయ్యాక ఎవరి పదవులు పీకేస్తారన్నది తేలిపోతుందని మరోసారి సంకేతాలు అందాయి. డివిజన్ ల వారీగా బాస్ అప్పగించిన పనిలో ఏ మాత్రం తేడా వచ్చినా మంత్రి గిరి కి మంగళం అని పై నుంచి ఆదేశాలు మెడమీద కత్తిలా వేలాడాయి.

ఎంత కష్టపడినా….

దాంతో అంతా గ్రేటర్ ఎన్నికల్లో రిక్షా తొక్కేశారు. అభ్యర్థులకు అయ్యే ఖర్చు నుంచి అన్ని దగ్గరుండి చూసుకున్నారు. గెలుపు ఓటమి పై అభ్యర్ధికి లేని టెన్షన్ వారికే ఉండేది. అవును పోతే వారికి కార్పొరేటర్ పదవే పోతుంది అదే తమకు అయితే ఏకంగా మంత్రి పదవి పోతుంది. బుగ్గకారు, పరివారం మాయం అయిపోతాయి. అవన్నీ తలుచుకుంటే కరోనా పేషేంట్ లా గజగజా వణికిపోతూ ఎన్నికలు నడిపారు కారు పార్టీ మంత్రులు.

వాళ్ళు నెత్తిన పాలు పోసేశారు …

ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు దడెక్కిపోయిన అమాత్యులకు అనుకున్నంత పని అయింది. చాలామంది మంత్రులు తాము బాధ్యత తీసుకున్న చోట్ల అభ్యర్థులను గెలిపించలేక పోయారు. ఇలాంటి వారిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జి గా ఉన్న అడిక్ మెట్ లో, ఆర్కేపురం బాధ్యత వహించిన సబితా ఇంద్రా రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి బాధ్యత వహించిన రెండు డివిజన్లలో అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అయితే కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత బాధ్యత వహించిన గాంధీనగర్ లో అధికారపార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. అదే విధంగా ఉప్పల్ ఎమ్యెల్యే సుభాష్ రెడ్డి భార్య స్వప్న ఓటమి పాలు అయితే, ముషీరాబాద్ ఎమ్యెల్యే ముఠాగోపాల్ మరదలు పరాజయం చెందారు. దాంతో వేటు పడితే కెటిఆర్ నుంచి పడాలిసి ఉంటుంది. దాంతో తమ జోలికి కెసిఆర్ వచ్చే ఛాన్స్ లేదని వీరంతా ఊపిరి పీల్చుకుంటున్నారని టాక్.

Tags:    

Similar News