మార్పు మంచికే కదా?

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మూడో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రామ్ లీలా మైదానంలో ఈ నెల 16వ తేదీన కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేవలం [more]

Update: 2020-02-15 17:30 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మూడో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రామ్ లీలా మైదానంలో ఈ నెల 16వ తేదీన కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేవలం ఏడేళ్లలో పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేసిన చరిత్ర కేజ్రీవాల్ ది. సామన్యుడి పార్టీగా జనంలోకి బలంగా తీసుకెళ్లిన బలమైన లీడర్ ఆయన. కేజ్రీవాల్ గెలుపు ఆషామాషీగా వచ్చింది కాదు. ఎవరిపైనో వ్యతిరేకతతో వచ్చింది అసలే కాదు. కేవలం తన నాయకత్వాన్ని, పాలనపైనే ప్రజలకు విశ్వాసం కల్పించడంలో కేజ్రీవాల్ సఫలమయినందునే ఈ గెలుపు సాధ్యమయింది.

వారికి దూరంగా…..

అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈసారి దీనికి ఒక స్పెషల్ ఉంది. ఏ రాజకీయ పార్టీకి, ఇతర రాష్ట్రాల నేతలను ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్ ఆహ్వానించడం లేదు. గతంలో బీజేపీయేతర పార్టీ నేతలను కేజ్రీవాల్ ఆహ్వానించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి కూడా కేజ్రీవాల్ వెళ్లారు.కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు వెళ్లారు. అలాగే తమిళనాడులో మక్కల్ నీది మయ్యమ్ పార్టీని కమల్ హాసన్ పెట్టినప్పుడు స్పెషల్ గెస్ట్ గా వెళ్లారు.

సఖ్యతగా ఉండాలని….

ఇలా బీజేపీయేతర నేతలతో సఖ్యతగా ఉన్న కేజ్రీవాల్ ఈసారి ఎందుకో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లే కనపడుతుంది. ఒకరకంగా కేంద్రంతో సయోధ్యగా ఉండేందుకే కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. ఢిల్లీ అభివృద్ధి తాను అనుకున్న రీతిలో జరగాలంటే అందుకు కేంద్రం సాయం అవసరం. అలాగే శాంతి భద్రతల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వానిదే అజమాయిషీ కావడంతో వైరం వద్దని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.

లెఫ్ట్ నెంట్ గవర్నర్ తోనూ….

అందుకే ప్రజల సమక్షంలో రామ్ లీలా మైదానంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రజల సమక్షంలో కేజ్రీవాల్ చేయనున్నారు. దీంతో పాటు లెఫ్ట్ నెంట్ గవర్నర్ తోనూ గతంలో మాదిరిగా దూకుడుగా వెళ్లకూడదని కేజ్రీవాల్ భావిస్తున్నారు. అభివృద్ధిని, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేయడంతో వాటిని కొనసాగించే లక్ష్యంగా మాత్రమే కేజ్రీవాల్ భవిష‌్యత్తులో అడుగులు వేయనున్నారు. మరి మార్పు మంచికే కదా?

Tags:    

Similar News