సైకిల్ సవారీ ఇక కలసి రాదట.. అందుకే?
మున్సిపల్ ఎన్నికల తర్వాత బెజవాడ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఈ మార్పులు తప్పేలా కన్పించడం లేదు. బెజవాడలో తెలుగుదేశం పార్టీకి [more]
మున్సిపల్ ఎన్నికల తర్వాత బెజవాడ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఈ మార్పులు తప్పేలా కన్పించడం లేదు. బెజవాడలో తెలుగుదేశం పార్టీకి [more]
మున్సిపల్ ఎన్నికల తర్వాత బెజవాడ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఈ మార్పులు తప్పేలా కన్పించడం లేదు. బెజవాడలో తెలుగుదేశం పార్టీకి పట్టుంది. అదే స్థాయిలో నేతలు కూడా ఉన్నారు. ఇదే ఆ పార్టీ కొంపముంచేలా ఉంది. ముఖ్యంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పార్టీ అధినాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఒంటరిగా మారి…..
కేశినేని నాని ఇప్పుడు బెజవాడ తెలుగుదేశం పార్టీలో ఒంటరి అయ్యారు. చంద్రబాబు కూడా కేశినేని నానిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆర్థికంగా, సామాజికపరంగా కేశినేని నాని వల్ల ఉపయోగం లేదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. అందుకే బెజవాడ టీడీపీలో మిగిలిన నేతలకు ఇచ్చిన ప్రాధాన్యత కేశినేని నానికి ఇవ్వడం లేదు. పార్టీకి ముగ్గురు పార్లమెంటు సభ్యులు ఉన్నా, వారిలో కేశినేని నానిని విడిగా చూస్తుండటమే ఇందుకు ఉదాహరణ.
కార్పొరేషన్ ఎన్నికలు…..
దీనికి తోడు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు కేశినేని నాని, పార్టీ అధిష్టానం మధ్య మరింత దూరాన్ని పెంచాయి. తాను గెలిచిన ఎంపీనని, ఓడిన ఎమ్మెల్యేను కాదని కేశినేని వార్నింగ్ నేరుగా అధినాయకత్వానికే వార్నింగ్ ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమయింది. కేశినేని నాని తన కూతురిని మేయర్ చేయాలనుకుంటున్నారు. అందుకు టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమ, దేవినేని ఉమ వంటి నేతలు అంగీకరిచడం లేదు. ఒకవేళ టీడీపీ అధిక స్థానాలను గెలుచుకున్నా చివరి క్షణంలో అధినాయకత్వం కేశినేని నానికి హ్యాండిచ్చే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.
ఫలితాల తర్వాత……
మరోవైపు తెలుగుదేశం పార్టీ రాను రాను బలహీనంగా మారుతుండటం కేశినేని నానిని ఆలోచనలో పడేసిందంటున్నారు. తాను టీడీపీలో ఉన్నా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కడం కష్టమేనని కేశినేని నాని భావిస్తున్నారు. టీడీపీలో ఉండి టెన్షన్ పడే కంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత జెండా పీకేయడమే బెటర్ అని కేశినేని నాని భావిస్తున్నారు. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.