కేశినేని గోడు వినేవారేరీ.. సొంత పార్టీనే మౌనం
టీడీపీ కీలక నాయకుడు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేత, విజయవాడ ఎంపీ.. కేశినేని నాని ఆవేదన అంతా ఇంతా కాదు. ఆయనను పార్టీలో పట్టించుకునే నాథుడు [more]
టీడీపీ కీలక నాయకుడు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేత, విజయవాడ ఎంపీ.. కేశినేని నాని ఆవేదన అంతా ఇంతా కాదు. ఆయనను పార్టీలో పట్టించుకునే నాథుడు [more]
టీడీపీ కీలక నాయకుడు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేత, విజయవాడ ఎంపీ.. కేశినేని నాని ఆవేదన అంతా ఇంతా కాదు. ఆయనను పార్టీలో పట్టించుకునే నాథుడు కనిపించడం లేదని ఒక ఆవేదన అయితే.. తాను చేసిన కృషి ఫలించకుండా పోయిందని మరో ఆవేదన ఆయనను పట్టిపీడిస్తోంది. తాజాగా విజయవాడలో రెండు ఫ్లై వోవర్లు.. ప్రారంభమయ్యాయి. విజయవాడలో కీలకమైన రద్దీ ప్రాంతం వన్ టౌన్‌లో కనకదుర్గ పైవంతెనను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అదే సమయంలో మరో కీలక ప్రాంతం బెంజిసర్కిల్ సమీపంలో మరో ఫ్లై వోవర్‌ను కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు.
ఫ్లైఓవర్లపై రగడ……
అయితే, ఈ రెండు వంతెనలకు సంబంధించి క్రెడిట్ విషయంలో వైసీపీ, టీడీపీ పోరాడుకుంటున్నాయి. మేం తెచ్చాం.. మేమే నిధులు ఇచ్చాం.. ఇది మా ఆలోచనే. విజయవాడ ప్రజలు మాకే రుణపడి ఉండాలి.. అని టీడీపీ ఓ ప్రకటన జారీ చేసింది..దీనిపై వైసీపీ అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏకంగా.. చంద్రబాబుకు కౌంటర్లు ఇచ్చారు. మీరు మొదలు పెడితే.. పూర్తి ఎందుకు చేయలేక పోయారు. దీనిని ఎన్నికల రాజకీయంగా వాడుకున్నారు. కానీ, మేం వచ్చాక కేంద్రం నుంచి నిధులు వడివడిగా తీసుకువచ్చి పూర్తి చేశాం.. మీరు చూసి ఆనందించండి..! అంతే తప్ప.. క్రెడిట్ కోసం బజారున పడకండి.. అని ఆయన ఘాటుగా వ్యాఖ్యలు సంధించారు.
తాను పోరాడితేనే…..
ఈ పరిణామాలపై ఎంపీ కేశినేని నాని మరింత ఆవేదన వ్యక్తం చేస్తూ.. మీడియా ముందుకు వచ్చారు. అరె.. ఈ రెండు ప్రాజెక్టుల కోసం నేనే కదా.. కేంద్రంతో పారాడాను. పార్లమెంటులో కనకదుర్గ ఫ్లై వోవర్ కోసం గొంతు చించుకుని మాట్లాడాను. ఇక, బెంజిసర్కిల్ ఫ్లైవోవర్‌కు కొబ్బరికాయ కొట్టింది కూడా నేనే కదా.. మరి నా పేరు టీడీపీకి కనిపించడంలేదా ? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ దిరికార్డుగా ఆయన బాబును టార్గెట్ చేశారు. అన్నీ వారి ఖాతాలోనే వేసుకున్నారు. మేం ఎందుకు ? అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
తన వల్లనే జరిగినా….
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు ఫ్లై ఓవర్ల కోసం ఎంపీ కేశినేని నాని పెద్ద పెద్ద ఫైల్స్ పట్టుకుని మరీ అప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆఫీసుల చుట్టూ తిరగడంతో పాటు, నాగ్‌పూర్‌కు పదే పదే వెళ్లి ప్రదక్షిణలు చేశారు. ఈ విషయాన్ని గడ్కరీ సైతం స్వయంగా ఒప్పుకుని కేశినేని నానిని ప్రశంసించారు. అయితే అప్పుడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమా మరోసటి రోజునే ప్రెస్‌మీట్ పెట్టి ఈ క్రెడిట్ ఎవ్వరిది కాదని.. కేంద్రంపై పోరాటం చేసిన రాష్ట్ర ప్రభుత్వానిది అని నానికి ఈ క్రెడిట్ రాకుండా తన ప్రయత్నం తాను చేశారు.
హైలెట్ కాకపోవడంతో……
వాస్తవానికి ఈ ఫ్లై ఓవర్ల విషయంలో ఎంతో కొంత క్రెడిట్ కేశినేని నానికి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. తీరా ఆయన్ను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆయనే స్వయంగా ఈ రెండు ప్రాజెక్టుల వెనుక తాను ఏమేం మాట్లాడానో.. వీడియో రికార్డింగ్ వేసి మరీ మీడియాకు వెల్లడించారు. మొత్తానికి కేశినేని నాి ఆవేదన అర్ధం చేసుకోదగిందే అయినా.. పట్టించుకునేవారు లేకపోవడం గమనార్హం. చిత్రం ఏంటంటే.. బాబు అనుకూల మీడియా కూడా నానిని హైలెట్ చేయకపోవడం..!