కేశినేని నాని ఛాప్టర్ క్లోజేనా.. ఎవ‌ర‌న్నారంటే..!

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు, ప‌ద‌వుల పందేరం వంటి విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. పార్టీలో కీల‌క‌మైన నేత‌లకు అన్యాయం చేస్తున్నారా ? లేదా వ్యూహాత్మకంగా ప‌క్కన పెడుతున్నారా [more]

Update: 2020-10-29 06:30 GMT

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు, ప‌ద‌వుల పందేరం వంటి విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. పార్టీలో కీల‌క‌మైన నేత‌లకు అన్యాయం చేస్తున్నారా ? లేదా వ్యూహాత్మకంగా ప‌క్కన పెడుతున్నారా ? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రీ ముఖ్యంగా పార్టీలోనే ఉంటూ.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. వారి సొంత అజెండాల‌ను అమ‌లు చేస్తున్న నేత‌ల‌ను చంద్రబాబు దూరంగా పెట్టార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, ఇక్కడ కీల‌క విష‌యం ఏంటంటే.. పార్టీలో దూరంగా ఉంటున్నంత మాత్రాన‌.. సొంత అజెండాలు అమ‌లు చేస్తున్నంత మాత్రాన దూరం పెడితే.. రేపు వీరితో చంద్రబాబుకు అవ‌స‌రం ఉండ‌దా ? అనే.

పడటం లేదా?

విజ‌య‌వాడ‌కు చెందిన ఎంపీ కేశినేని నాని విష‌యంలో పెద్ద ఎత్తున చంద్రబాబుపై వ్యతిరేక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయ‌న‌ను పార్టీ ప‌ద‌వుల్లో ఎక్కడా ప్రాధాన్యంలోకి తీసుకోలేదు. కొన్ని రోజుల కింద‌ట నియ‌మించిన పార్లమెంట‌రీ జిల్లా క‌మిటీల్లో కేశినేనినానికి ప్రాధాన్యం ఉంటుంద‌ని అనుకున్నారు. గుంటూరు లేదా.. ప్రకాశం జిల్లాల్లో పార్లమెంట‌రీ జిల్లాల ఇన్‌చార్జ్‌గా ( క‌మ్మ వ‌ర్గం కోటాలో) ఆయ‌న‌కు అవ‌కాశం ఇస్తార‌ని అనుకున్నారు. కానీ, ఎక్కడా కూడా కేశినేని నాని ఊసేలేకుండా పోయింది. పైగా కీల‌క‌మైన విజ‌య‌వాడ పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ అధ్యక్ష ప‌ద‌వి ఎప్పుడో జ‌నాలు మ‌ర్చిపోయిన మాజీ మంత్రి నెట్టెం ర‌ఘురాంకు ఇచ్చారు.

ముగ్గురిలో ఇద్దరికి……

ఇదిలావుంటే, పార్టీలో ఇప్పుడు తాజాగా ప్రక్షాళ‌న చేశారు. అనేక ప‌ద‌వులు ఇచ్చారు. క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌ల‌ను పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో అయినా కేశినేని నానికి అవ‌కాశం ఉంటుంద‌ని అనుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ముగ్గురు ఎంపీల‌ను టీడీపీ గెలుచుకుంది. వీరిలో గ‌ల్లాజ‌య‌దేవ్‌, కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడుల‌కు పార్టీలో ప‌ద‌వులు ఇచ్చారు. గ‌ల్లాను పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అదే స‌మ‌యంలో జాతీయ పార్టీ ప్రధాన కార్యద‌ర్శిగా రామ్మోహ‌న్‌కు అవ‌కాశం ఇచ్చిన చంద్రబాబు కేశినేని నానికి మాత్రం ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ ప‌రిణామాలతో కేశినేని నాని మ‌రింత ఆగ్రహంతో ఉన్నార‌ని.. అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు.

ప్రయోజనం లేదనేనా?

ఇదే విష‌యంపై విజ‌య‌వాడ‌కు చెందిన టీడీపీ కీల‌క నాయ‌కుడు ఒక‌రు మాట్లాడుతూ.. కేశినేని నాని వ‌ల్ల ప్రయోజనం లేదు., ఆయ‌న పార్టీకి మేలు చేయ‌డం లేదు. బ‌హుశా అందుకే బాబు ఆయ‌న‌ను దూరం పెట్టి ఉంటారు. అని ఆఫ్ దిరికార్డుగా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఇప్పటికే విజ‌య‌వాడ‌లో ఇటీవ‌ల ప్రారంభ‌మైన రెండు కీల‌క ఫ్లైఓవర్లకు సంబంధించి త‌న‌ను గుర్తించ‌క‌పోవ‌డంపై నాని తీవ్ర ఆగ్రహంతో ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు పార్టీలోనూ ప‌ద‌వులు ఇవ్వక‌పోవ‌డంపై కేశినేని నానిమ‌రింత ఫైర‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మ‌రి ఏ రూపంలో విరుచుకుప‌డ‌తారో ? చూడాలి.

Tags:    

Similar News