కేశినేని నానిని రౌండప్… అటాక్ మోడ్ లో టీడీపీ

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విజయవాడ టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కేశినేని నానిని టార్గెట్ చేసేందుకు బెజవాడ టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. కేశినేని నాని [more]

Update: 2021-03-06 08:00 GMT

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విజయవాడ టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కేశినేని నానిని టార్గెట్ చేసేందుకు బెజవాడ టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. కేశినేని నాని కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత విభేదాలు మరింత ముదిరాయి. కేశినేని నానికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు ఒక్కటయ్యారు.

ఆయననే టార్గెట్ గా….

కేశినేని నాని వెంట ఉంటే తాము చంద్రబాబు సభలో కూడా పాల్గొనబోమని స్పష్టం చేశారు. నిజానికి గుంటూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా టీడీపీ కమ్మ సామాజికవర్గానికి కేటాయించారు. దీంతో విజయవాడ మేయర్ అభ్యర్థిగా వేరే సామాజిక వర్గానికి ఇస్తారని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా కేశినేని నాని కూతురు శ్వేతకు మేయర్ పదవి ఇచ్చారు. చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసి మేయర్ సీటు తెచ్చుకున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఎవరినీ కలుపుకుని పోకుండా….

కేశినేని నాని కూడా నేతలను కలుపుకుని పోకుండా తప్పు చేశారు. విజయవాడలో బీసీలకు మేయర్ పదవి ఇవ్వాలని వారు పార్టీని కోరారు. గతంలో పంచుమర్తి అనూరాధను మేయర్ గా చేశారు. ఇదే విషయాన్ని గుర్తు చేశారు. అయినా కేశినేని నానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన వ్యతిరేక వర్గం మండి పడుతుంది. మరోవైపు కేశినేని నాని కూడా తాను ఒక్కడినే గెలిచానని, ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోయారన్నది గుర్తుంచుకోవాలని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు మరింత మంట పుట్టించాయి.

రివర్స్ అవడంతో…..

దీంతో ఎన్నికలు ఇంకా నాలుగు రోజులు ఉన్న సమయంలో టీడీపీ నేతలు రివర్స్ అవడం కేశినేని నానికి ఇబ్బందిగా మారింది. చంద్రబాబు కేశినేని నానిని కంట్రోల్ చేయాలని వారు కోరుతున్నారు. విజయవాడలో మాత్రం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాపు వర్సెస్ కమ్మగా మారిందనే చెప్పాలి. కేశినేని నాని విష‍యంలో చంద్రబాబు తక్షణం జోక్యం చేసుకోకపోతే విజయవాడ నగరంలో పార్టీ మరింత బలహీనపడే అవకాశముంది. కేశినేని నాని కూతురు మేయర్ కాకుండా టీడీపీ నేతలే అడ్డుపడుతున్నారనే భావించాలి. ఈ విభేదాలు మరింత ముదరడంతో అధిష్టానం ఏ మేరకు కంట్రోల్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News