కేశినేనికి ఇక కష్టాలేనట… బెజవాడ టీడీపీలో హాట్ టాపిక్
విజయవాడ టీడీపీ రాజకీయాలు మరోసారి హీటెక్కేందుకు రెడీగా ఉన్నాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నిక ల్లో విజయవాడ కార్పొరేషన్‌ను దక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా శ్రమించారు. [more]
విజయవాడ టీడీపీ రాజకీయాలు మరోసారి హీటెక్కేందుకు రెడీగా ఉన్నాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నిక ల్లో విజయవాడ కార్పొరేషన్‌ను దక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా శ్రమించారు. [more]
విజయవాడ టీడీపీ రాజకీయాలు మరోసారి హీటెక్కేందుకు రెడీగా ఉన్నాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నిక ల్లో విజయవాడ కార్పొరేషన్‌ను దక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలోనే ఆయన కూడా విజయవాడపై మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడ స్వయంగా ప్రచారం చేశారు. ఇక్కడ విజయం సాధించడం ద్వారా మూడు రాజధానుల ప్రతిపాదనకు.. అడ్డుకట్ట వేయాలని అనుకున్నారు. అయితే.. అది సాధ్యం కాలేదు. వైసీపీ ఇక్కడ విజయం దక్కించుకుంది. టీడీపీ కేవలం 14 డివిజన్లకే పరిమితం అయ్యింది. దీంతో ఇప్పుడు తమ్ముళ్ల మధ్య అంతర్మథనం ప్రారంభమైంది.
తానే బాస్ నంటూ….
గెలుస్తుందని అనేక అంచనాలు వేసుకున్న విజయవాడ టీడీపీ ఎందుకు చతికిల పడిందనే విషయం ఆసక్తిగా మారింది. కొంచెం లోతుగా చూస్తే.. ఎంపీ కేశినేని నాని దూకుడు వ్యవహారమే పార్టీని పుట్టి ముంచిందని సీనియర్లు తేలుస్తున్నారు. ఆయన ఎవరినీ పట్టించుకోకపోవడం.. అభ్యర్థుల ఎంపికలో మిగిలినవారికి కూడా అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనను సైతం తోసిపుచ్చడం వంటివి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో పార్టీలో ఇతర నేతలను తక్కువగా అంచనా వేసి.. తాను మాత్రమే విజయం సాధించాననే ప్రకటనలు చేయడం కూడా పార్టీని పలుచన చేశాయనే అంచనాలు వస్తున్నాయి. అక్కడితో ఆగని కేశినేని నాని బెజవాడ టీడీపీకి తానే బాస్‌ను అని.. ఏపీకి చంద్రబాబు బాస్ అని ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు.
రెండోసారి విజయం సాధించగానే…?
వాస్తవానికి కేశినేని నాని దూకుడు ఇప్పుడు కొత్తకాదు.. 2019 ఎన్నికల్లో విజయం తర్వాత.. వెంటనే ఆయన పార్టీపై తిరుగు బాటు చేసినంత పనిచేశారు. ఏకంగా చంద్రబాబుపైనే ఆయన దూకుడుగా వ్యవహరించారు. అదే సమయంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వంటివారిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ బీజేపీ నేతలను పదే పదే మీట్ అయ్యేవారు. ఆ తర్వాత.. కూడా పార్టీకి దూరంగా ఉన్నారు. ఇక, కరోనా సమయంలో ఏడాది పాటు అసలుపార్టీని కూడా పట్టించుకోలేదు. ఇక, ఎన్నికలకు ముందు రంగంలోకి దిగినా.. ఆయన వ్యవహారం మాత్రం మారలేదు.
సొంత పార్టీ నేతలే….
పైగా సొంత పార్టీ నేతలపైనే సవాళ్లు రువ్వే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో.. ఎంపీ కేశినేని నాని ఒంటెత్తు పోకడలే పార్టీని ముంచాయనే అభిప్రాయం సర్వత్రావి నిపిస్తోంది. నిజానికి అందరూ వద్దని అన్నప్పటికీ.. చంద్రబాబు కేశినేని నాని కుమార్తె శ్వేతకు మేయర్‌గా అవకాశం కల్పించారు. కానీ, పార్టీ మాత్రం ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేశినేని నాని ని ఇంకా పెద్దోణ్ని చేయడం ద్వారా.. మిగిలిన మొత్తాన్ని కూడా డమ్మీలు చేయడం మంచిది కాదనే సూచనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేశినేని నాని ని పక్కన పెట్టే ఆలోచన అధిష్టానం చేస్తోందని అంటున్నారు.