Kesineni : కేశినేని క్విట్… టీడీపీకి ఝలక్
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని డిసైడ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీని వదిలేయాని ఆయన నిర్ణయించుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే ప్రకటన వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయన భారతీయ [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని డిసైడ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీని వదిలేయాని ఆయన నిర్ణయించుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే ప్రకటన వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయన భారతీయ [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని డిసైడ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీని వదిలేయాని ఆయన నిర్ణయించుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే ప్రకటన వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఈమేరకు పూర్తి స్థాయిలో సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని బీజేపీ నుంచి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
అసంతృప్తి తీవ్రమై….
కేశినేని నాని గత కొంత కాలంగా పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు నానా దుర్బాషలాడినా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. పైగా పార్టీలో వారికే పదవులు కేటాయిస్తుండటాన్ని కేశినేని నాని జీర్ణించుకోలేక పోతున్నారు. తొలినుంచి మాజీ మంత్రి దేవినేని ఉమతో కూడా ఆయనకు పడేది కాదు. పార్టీ కార్యాలయాన్ని కేశినేని ఇంటి నుంచి తీసివేయడాన్ని కూడా సహించలేకపోతున్నారు.
పట్టంచుకోకపోవడంతో…
ఇటీవల కేశినేని నాని చంద్రబాబును కలసి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని స్పష‌్టం చేశారు. అయితే ఈ మాట చెప్పి నెల గడుస్తున్నా ఇంతవరకూ చంద్రబాబు కేశినేనిని బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. కేశినేని పోటీ చేయడకపోవడమే మంచిదన్న అభిప్రాయంలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు ఆయన గుర్తించారు. దీంతో పాటు రోజరోజుకూ కేశినేని అభిమానులు, సన్నిహితుల నుంచి వత్తిడి ఎదురవుతోంది.
మోడీ సమక్షంలో….
ఈ నేపథ్యంలో కేశినేని నాని బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. కేంద్రంలో ఒక ముఖ్యనేతను ఇప్పటికే ఆయన సంప్రదించారని చెబుతున్నారు. ప్రధాని మోడీ సమక్షంలోనే కేశినేని నాని బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీజేపీలో తనకు రాజకీయ భవిష‌్యత్ ఉన్నా లేకపోయినా తనను రెండుసార్లు గెలిపించిన విజయవాడ పార్లమెంటు ప్రజలకు సేవ చేస్తుంటానని నాని చెబుతున్నారు. మొత్తం మీద అతి త్వరలోనే కేశినేని నాని నుంచి నిర్ణయం వెలువడే అవకాశముంది. ఇప్పటికే కేశినేని భవన్ లో చంద్రబాబు, టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు. వాటి స్థానంలో రతన్ టాటా ఫొటోలను ఉంచారు. సేవా కార్యక్రమాలలో ముందుంటానని కేశినేని నాని ఈ ఫొటోలతో చెప్పకనే చెప్పారు.