టీడీపీ ఎంపీల్లో ఈయ‌నే చాలా వెనుక‌బ‌డ్డార‌ట

ఏపీలో ప్రధాన ప్రతిప‌క్షం.. టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహ‌న్‌నాయుడు, గుంటూరు నుంచి గ‌ల్లా జ‌య‌దేవ్‌, విజ‌య‌వాడ నుంచి కేశినేని శ్రీనివాస్ ఉర‌ఫ్ [more]

Update: 2020-07-09 13:30 GMT

ఏపీలో ప్రధాన ప్రతిప‌క్షం.. టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహ‌న్‌నాయుడు, గుంటూరు నుంచి గ‌ల్లా జ‌య‌దేవ్‌, విజ‌య‌వాడ నుంచి కేశినేని శ్రీనివాస్ ఉర‌ఫ్ నానిలు విజ‌యం సాధించారు. నిజానికి వీరంతా కూడా వ‌రుస‌గా గెలిచిన వారే. పైగా జ‌గ‌న్ సునామీని తట్టుకుని గెలుపు గుర్రాలు ఎక్కిన వారే. ఇక‌, వీరు ఎంపీలుగా ఎన్నికై.. ఏడాది గ‌డిచిపోయింది. ఈ ఏడాది కాలంలో ఎవ‌రెవ‌రు రికార్డు సాధించారు? ఎవ‌రు వెనుక‌బ‌డ్డారు? అనే విష‌యాల‌ను ఇటీవ‌ల పార్లమెంటు నివేదిక వెల్ల‌డించింది. ఒక్క టీడీపీ ఎంపీల‌కు సంబంధించే కాదు.. మొత్తంగా.. దేశంలోని 543 మంది ఎంపీల‌కు సంబంధించి నివేదిక ఇచ్చింది.

వారిద్దరూ…..

ఈ నివేదికపై టీడీపీలో చ‌ర్చ సాగుతోంది. ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు పెర‌ఫార్మెన్స్ బాగానే ఉంద‌ని నివేదిక ఇచ్చింది. పైగా ఆయ‌న‌కు ప్రతిష్టాత్మకమైన సంస‌ద్ ర‌త్న పుర‌స్కారం కూడా ల‌భించింది. పార్లమెంటులోనూ, బ‌యటా కూడా ఆయ‌న వాయిస్ ఎక్కువుగా వినిపిస్తూ ఉంటుంది. ఇక‌, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ పెర‌ఫార్మెన్స్ కూడా ఫ‌ర్వాలేద‌ని నివేదిక స్పష్టం చేసింది. మిగిలిన మూడో ఎంపీ కేశినేని నాని ఫెర్మార్మెన్స్ మాత్రం అటు పూర్ కాదు.. ఇటు బెట‌ర్ కాదు.. అన్న విధంగా ఉంద‌ని నివేదిక స్పష్టం చేసింది. పార్లమెంటు చ‌ర్చల్లో పాల్గొన‌డం ద‌గ్గర నుంచి పార్లమెంటు స‌భ‌ల‌కు హాజ‌ర‌వడం వ‌ర‌కు, ఆయ‌న ప‌లు స‌మ‌స్యల‌పై సంధించిన ప్రశ్నల నుంచి ఆయ‌న వ్యవ‌హారం వ‌ర‌కు అంతా కూడా ఏడాది కాలానికి పార్లమెంటు స్పీక‌ర్ నివేదిక రూపంలో ఇచ్చారు. దీనిలో హాజ‌రుబాగానే ఉన్నప్పటికీ.. స‌మ‌స్యల‌ను ప్రస్థావించింది పెద్దగా లేద‌ని పేర్కొంది.

భాషా పరంగా కూడా…

అదే స‌మ‌యంలో భాషా ప‌ర‌మైన ఇబ్బంది ఉన్న ఎంపీల జాబితాలో కేశినేని నాని పేరును ప్రస్థావించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి దేశంలో ప్రాంతీయ భాష‌ల ప్రభావం ఎక్కువ‌గా ఉంది. అయిన‌ప్పటికీ.. ఎంపీలు హిందీపై ప‌ట్టు సాధిస్తారు. కానీ, కేశినేని నాని మాత్రం ఆరేళ్లపాటు ఎంపీగా ఉన్నప్పటికీ.. భాష‌పై ప‌ట్టు సాధించ‌లేక పోయారు. ఇక‌, చ‌ర్చల్లోనూ ఆయ‌న పాల్గొనేందుకు ఇదే అడ్డంకిగా ఉన్నట్టు తాము భావిస్తున్నామ‌ని పార్లమెంటు నివేదిక కొంద‌రి జాబితాలో కేశినేని నాని పేరును కూడా ప్రస్థావించింది. స‌మ‌స్యల‌ను ప్రస్థావించ‌డంలోనూ గ‌డిచిన ఐదేళ్ల కంటే కూడా కొంత వెనుక వెనుక‌బ‌డ్డార‌ని తెలిపింది. మొత్తంగా ఈ నివేదిక‌లో టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని థ‌ర్డ్ ప్లేస్‌లో ఉన్నార‌నే విష‌యం స్పష్టం చేసింది. దీనిపై టీడీపీ అధిష్టానం కూడా దృష్టి పెట్టింది. అయినా.. ఏమీ అనే ప‌రిస్థితి మాత్రం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News