కేతిరెడ్డి మళ్లీ ఆ తప్పు చేయరట

విజయం దక్కాలంటే ఎంతో శ్రమ అవసరం. ప్రజలు తమపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపిస్తే అనేకమంది నేతలు నియోజకవర్గానికి దూరంగా ఉంటుండటం సర్వసాధారణం. అప్పుడప్పుడు వచ్చి [more]

Update: 2020-12-29 15:30 GMT

విజయం దక్కాలంటే ఎంతో శ్రమ అవసరం. ప్రజలు తమపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపిస్తే అనేకమంది నేతలు నియోజకవర్గానికి దూరంగా ఉంటుండటం సర్వసాధారణం. అప్పుడప్పుడు వచ్చి ప్రజా సమస్యలను తెలుసుకోవడం రివాజుగా మారింది. వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల్లో అధిక మంది బెంగళూరు, హైదరాబాద్ లలో తమ వ్యాపారాలకే పరిమితమవుతున్నవారు అనేక మంది ఉన్నారు. కానీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాత్రం నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుండటం విశేషం.

వైసీపీ తొలిసారి….

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 2014లో ఓటమి పాలయ్యారు. అసలు ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ ఐదుసార్లు విజయం సాధించగా, కాంగ్రెస్ రెండు సార్లు గెలుపు దక్కించుకుంది. వైసీపీ తొలిసారి విజయం చేజిక్కించుకుంది.

గతంలో చేసిన పొరపాట్లను…..

అయితే ఈసారి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గతంలో చేసిన పొరపాట్లను చేయలదలచుకోలేదు. ఆయన నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా నియోజకవర్గాన్ని పీఏలకు వదిలిపెట్టడం లేదు. తానే స్వయంగా ప్రజల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. గత కొన్నాళ్లుగా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పట్టణంలోని మున్సిపల్ వార్డులలో పర్యటిస్తున్నారు.

నిత్యం ప్రజల్లోనే…..

ఉదయాన్నే ఎంపిక చేసిన వార్డులను కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పర్యటిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, గ్రామ సచివాలయంతో కలసి ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. రేషన్ కార్డు దగ్గర నుంచి రోడ్డు పనులు, చెత్త తరలింపు వంటి సమస్యలను అక్కడకక్కడే పరిష్కరిస్తున్నారు. మరోసారి విజయం కోసం ఆయన ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేల్లో కల్లా డిఫరెంట్ గా ముందుకు వెళుతున్నారు. విషయం తెలుసుకున్న జగన్ కూడా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని ఇటీవల అభినందించినట్లు తెలిసింది.

Tags:    

Similar News