పార్టీ మారినా ఫలితం లేదే?
కాంగ్రెస్ లో ఉంటేనే కళ.. బీజేపీలో చేరితే సముద్రంలో నీటిబొట్టు లాంటిదే. ఇప్పుడు తమిళనాడులో సినీనటి ఖుష్బూ పరిస్థితి అలాగే ఉంది. ఖుష్బూ తమిళనాడులో సినీనటిగా ఎంతో [more]
కాంగ్రెస్ లో ఉంటేనే కళ.. బీజేపీలో చేరితే సముద్రంలో నీటిబొట్టు లాంటిదే. ఇప్పుడు తమిళనాడులో సినీనటి ఖుష్బూ పరిస్థితి అలాగే ఉంది. ఖుష్బూ తమిళనాడులో సినీనటిగా ఎంతో [more]
కాంగ్రెస్ లో ఉంటేనే కళ.. బీజేపీలో చేరితే సముద్రంలో నీటిబొట్టు లాంటిదే. ఇప్పుడు తమిళనాడులో సినీనటి ఖుష్బూ పరిస్థితి అలాగే ఉంది. ఖుష్బూ తమిళనాడులో సినీనటిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే సినీరంగంలో రాణించిన ఖుష్బూ రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోతుంది.
జాతీయ పార్టీలో చేరి…..
తమిళనాడులో సినీ రంగంలో నుంచి వచ్చిన మరో రాజకీయ నేత ఖుష్బూ. తమిళనాడులో అనేక మంది సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. వారిలో రాణించినవారు అతికొద్దిమందే. జయలలిత లాంటి వారు మాత్రమే రాజకీయాల్లో నిలదొక్కుకోగలిగారు. అయితే తమిళనాడులో ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ పార్టీలు ఇక్కడ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. ఖుష్బూ అక్కడే రాంగ్ స్టెప్ వేశారు.
కాంగ్రెస్ లో ఉన్నా…..
ఆమె రాజకీయాల్లోకి రావడమే జాతీయ పార్టీని ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో ఖుష్బూ క్రియాశీలకంగా వ్యవహరించారు. క్రౌడ్ పుల్లర్ కావడంతో ఖుష్బూను కాంగ్రెస్ బాగానే ఆదరించింది. 2016 ఎన్నికల్లో ఖుష్బూ పోటీ చేయాలనుకున్నా ఆమెకు టిక్కెట్ దక్కలేదు. దీంతో ఖుష్బూ సరిపెట్టుకుని కాంగ్రెస్ తోనే కొంతకాలం నడిచారు. కాంగ్రెస్ లో ఉంటే ఈసారికూడా తనకు టిక్కెట్ దక్కదని భావించి ఇటీవల ఖుష్బూ బీజేపీ లో చేరారు.
ఇప్పడు బీజేపీలో చేరినా…
ఖుష్బూ ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనాలని గట్టిగా భావించారు. చెపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అన్నాడీఎంకే పొత్తులో భాగంగా ఈస్థానాన్ని పీఎంకే కు కేటాయించింది. ఈ స్థానం నుంచి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి పోటీ చేస్తున్నారు. ఈ స్థానాన్ని అన్నాడీఎంకే పీఎంకేకు కేటాయించడంతో ఖుష్బూ ఆశలుఅడియాసలయ్యాయి. అయితే ఖుష్బూకు తర్వాత థౌజండ్స్ లైట్స్ టిక్కెట్ ను బీజేపీ కేటాయించింది. ప్రస్తుతం అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఖుష్బూ గెలుపు అంత సులువు కాదంటున్నారు. పార్టీ మారినా ప్రయోజనం లేదంటున్నారు.