క్లోజ్ అయినట్లేనా…?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నాయకుల తలరాతలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడమూ కష్టమే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ అసెంబ్లీ మాజీ [more]

Update: 2019-08-09 08:00 GMT

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. నాయకుల తలరాతలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడమూ కష్టమే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌, సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, టీడీపీకి వీర విధేయుడు కోడెల శివప్రసాదరావు. నిన్న మొన్నటి వరకు అందరి మన్ననలు పొందిన ఆయన తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. 2014లో 780 ఓట్ల తేడాతో గెలిచిన కోడెల శివప్రసాదరావు తాజా ఎన్నికల్లో దాదాపు భారీ తేడాతో ఓడిపోయారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తనను గెలిపించిన నియోజకవర్గం కన్నా కూడా తాను ఆదిలో గెలిచిన నరసరావుపేట నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం ఆయన ప్రయత్నించారు.

ఆధిపత్యం కోసమే…

స్పీక‌ర్ ప‌ద‌విలో ఉండి స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయ‌డం కంటే రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఆధిప‌త్యం కోస‌మే ఆయ‌న ఐదేళ్లు కాలం గ‌డుపుతూ స‌రిపెట్టేశారు. దీనిని సత్తెనపల్లి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక, ఆయన కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరామ కృష్ణలు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని సాగించిన దందాలు, చేసిన అక్రమాలు గత చంద్రబాబు ప్రభుత్వం లోనే వెలుగు చూసినా.. అప్పటి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫిర్యాదు చేయాలనుకున్న వారిపై ఎదురు కేసులు పెట్టించారు.

అండగా నిలవాల్సిన నేతలు….

అయితే, ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం రావడంతో కోడెల వారసుల కొంప మునుగుతోంది. ఏకంగా విజయలక్ష్మి అరెస్టుకే రంగం సిద్ధమవుతోంది. ఈ విషయంలో జోక్యం చేసుకునిముందస్తు బెయిలు పొందాలని ఆమె చేసిన ప్రయత్నాలను హైకోర్టు తోసిపుచ్చింది. అదేవిధంగా శివరామకృష్ణపైనా కేసులు నమోదవుతున్నా యి. ఈ నేపథ్యంలో ఈ కుటుంబానికి అండగా నిలవాల్సిన టీడీపీ మౌనం వహించింది. ఇప్పటికే ఒకటికి రెండు సార్లు మీడియా ముందుకు వచ్చిన కోడెల తనకు జరిగిన అన్యాయంపై ఎలుగెత్తారు. అయినా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ కూడా పొందలేక పోయారు. దీంతో దాదాపు ఆయనను వదిలించుకునేందుకే బాబు రెడీ అవుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి.

చెక్ పెట్టేందుకే…..

నిజానికి తాను సత్తెనపల్లిలోనే ఉన్నా.. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన నరసరావు పేటలో తన కుమారుడు శివరామకృష్ణను డెవలప్‌ చేయాలని కోడెల భావించారు. కానీ, ఇప్పటికే గ‌త ఎన్నిక‌ల్లో అక్కడ చదలవాడ అర‌వింద బాబును రంగంలోకి దించిన చంద్రబాబు ఆయనను అక్కడినుంచి తప్పించేందుకు అవకాశం లేదు. బీసీ కోటాలో న‌ర‌సారావుపేట సీటు ఇచ్చిన చంద్రబాబు అక్కడ కోడెల‌కు చెక్ పెట్టేందుకు ఇలా వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించార‌న్న అభిప్రాయం కూడా ఉంది. ఇక, గుంటూరులోని మరో కీలక నేత రాయపాటి రంగారావు ఇటీవల బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

రాయపాటి కుమారుడికి….

సీనియ‌ర్ నేత రాయ‌పాటి ఎలాగూ ఇక ఎన్నిక‌ల‌కు దూరంగానే ఉంటారు. వివాద రహితుడైన రాయపాటి ఫ్యామిలీని పార్టీలోనే ఉంచుకోవాలని నిర్ణయించుకున్న బాబు.. ఆయనను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా ఆయన కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జ్‌ పోస్టును ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఎన్నిక‌ల‌కు ముందే రాయ‌పాటి త‌న వార‌సుడి కోసం స‌త్తెన‌ప‌ల్లి సీటు కోసం ప‌ట్టుబ‌ట్టినా బాబు కోడెల శిప్రసాద్ వైపే మొగ్గు చూపారు. ఈ లెక్కన చూస్తే రెండు చోట్లా కోడెల‌కు దారులు మూసుకుపోతున్నారు. ఇక కోడెల వార‌సుడి విష‌యంలో బాబే కాదు స్థానిక‌, జిల్లా నేత‌లే సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో కోడెల ఫ్యామిలీ రాజ‌కీయ చ‌రిత్ర దాదాపు క్లోజ్ అయిన‌ట్టే అంటున్నారు విశ్లేషకులు. ప్రజలకు దగ్గర కాలేక పోవడం, తీవ్రమైన వివాదాల్లో కూరుకుపోవడమే ఈ కుటుంబాన్ని టీడీపీకి దూరం చేసిందని చెబుతున్నారు.

Tags:    

Similar News