బిగ్ బ్రేకింగ్ : కోడెల ఇక లేరు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి చెందారు. ఆయన ఈరోజు ఉదయం ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు. [more]

Update: 2019-09-16 07:11 GMT

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి చెందారు. ఆయన ఈరోజు ఉదయం ఆత్మహత్యాయత్నం చేశారు. ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు. కోడెల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను బసవతారకం ఆసుపత్రిలో చేర్పించారు. వరసగా నమోదవుతున్న కేసులపై ఈరోజు ఉదయం కోడెల శివప్రసాద్ తన కుమారుడు శివరాంతో కొంత మాటలు పెరిగినట్లు తెలిసింది. కేసులు ఇలా రావడానికి కారణమైన శివరాంను కోడెల మందలిచారని చెబుతున్నారు. కోడెల కుమారుడు శివరాం, ఆయన కుమార్తెపైన కూడా వరసగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయన వయసు 72 సంవత్సరాలు.

Tags:    

Similar News