కోడెల ఫ్యామిలీ ఇక అంతేనా?

సెంటిమెంటును తాను న‌మ్ముకోవ‌డం కాదు.. తాను కూడా సెంటిమెంటుకు లొంగిపోయే మ‌న‌స్తత్వం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు పెద్ద చిక్కే వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రస్తుతం [more]

Update: 2020-02-29 09:30 GMT

సెంటిమెంటును తాను న‌మ్ముకోవ‌డం కాదు.. తాను కూడా సెంటిమెంటుకు లొంగిపోయే మ‌న‌స్తత్వం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు పెద్ద చిక్కే వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రస్తుతం టీడీపీని పుంజుకొనేలా చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై పెద్దగానే ఉంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో తీవ్రంగా త‌గిలిన గాయం నుంచి పార్టీని కాపాడుకుని మున్ముందుకు ప‌రుగులు తీయించే క్రమంలో నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇం చార్జ్‌ల‌ను నియ‌మిస్తున్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలో నాయ‌కులు జంప్ చేయ‌డం, మ‌రికొని చోట్ల మ‌ర‌ణాలతో ఇంచార్జ్ పోస్టులు ఖాళీ అయ్యాయి.

ఇద్దరూ పోటీ పడుతుండటంతో…

అయితే, ఈ క్రమంలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎలాంటి స‌మ‌స్యలూ రాకున్నప్పటికీ గుంటూరు జిల్లా స‌త్తెనప‌ల్లిలో మాత్రం చంద్రబాబు పెద్దచిక్కు వచ్చింది. ఇక్కడ ఇంచార్జ్ ప‌ద‌వి కోసం రెండు కుటుంబాల‌ను ఆయన ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఒక‌వైపు దివంగ‌త కోడెల శివ‌ప్రసాద‌రావు కుమారుడు, మ‌రోవైపు న‌ర‌స‌రావుపేట మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడు. ఈ ఇద్దరూ కూడా స‌త్తెన‌ప‌ల్లి ఇంచార్జ్ సీటును ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఎవ‌రికి ఈ సీటు ఇవ్వాల‌నేది చంద్రబాబుకు మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నగా మారిపోయింది.

కోడెల కుటుంబానికి…

ముఖ్యంగా కోడెల ఫ్యామిలీ సెంటిమెంటు చంద్రబాబును వేధిస్తోంది. పార్టీలో ఆది నుంచి కూడా కోడెల సేవ‌లు అందించారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయ‌న మ‌ర‌ణించే వ‌ర‌కు కూడా పార్టీలోనే ఉన్నారు. అ నేక కేసులు ఎదుర్కొన్నారు. నిజానికి ఈ కేసుల కార‌ణంగానే ఆయ‌న మాన‌సికంగా వేద‌న‌కు గురై.. ఆత్మ హ‌త్య చేసుకున్నారు. దీంతో ఆయ‌న కుటుంబానికి చంద్రబాబు మ‌ద్దతుగా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంది.

వారసులకి ఇవ్వాలని….

పైగా గుంటూరు జిల్లా అంత‌టా కోడెల‌కు అనుచ‌ర‌గ‌ణం ఉంది. ఇక న‌రసారావుపేట‌, స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కోడెల‌కు బ‌ల‌మైన వ‌ర్గం ఉంది. ఇప్పుడు కోడెల లేక‌పోవ‌డంతో వాళ్లు కోడెల వార‌సుడు శివ‌రాం వెంట న‌డుస్తారా ? ఆయ‌న వెన‌క నిలుస్తారా ? అన్న‌ది సందేహ‌మే. అయితే, ఇదే స‌మ‌యంలో పార్టీలో సీనియ‌ర్‌గా ఉన్న రాయ‌పాటి కుమారుడికి కూడా న్యాయం చేయాలి. రాయ‌పాటి రాజ‌కీయ నిష్క్రమ‌ణ ఖాయమైంది. ఇక రంగారావు గ‌త రెండేళ్ల‌కు పైగా పార్టీకి రాష్ట్ర స్థాయిలో ప‌ని చేస్తున్నారు. ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలో అటు సెంటిమెంటు.. ఇటు అంకిత భావం మ‌ధ్య చంద్రబాబు స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News