బ్యాడ్ టైం మామూలుగా లేదే

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు బ్యాడ్ పిరియడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. అసెంబ్లీ ఫర్నిచర్ కొట్టేసిన వ్యవహారం నుంచి ఆయన బయటపడకుండానే మాజీ స్పీకర్ కోడెల [more]

Update: 2019-08-28 05:00 GMT

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు బ్యాడ్ పిరియడ్ ఇప్పట్లో ముగిసేలా లేదు. అసెంబ్లీ ఫర్నిచర్ కొట్టేసిన వ్యవహారం నుంచి ఆయన బయటపడకుండానే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బాగోతం మరొకటి వెలుగులోకి వచ్చేసింది. అది కూడా ఆయన పుత్ర రత్నం నిర్వాకమే కావడం విశేషం. తండ్రి చేలో మేస్తే కుమారుడు గట్టున మేస్తాడా మరి. కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం తన దందా ను టిడిపి సర్కార్ హయాంలో దర్జాగా నిర్వహించేశారు. ఈ బాగోతం అమరావతి లో జరిగింది కాదు చిత్తూరు జిల్లా లోని తిరుపతి లో కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

తిరుపతి లో తప్ప …

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదలైంది నాటి స్పీకర్ కోడెల శివప్రసాద్ అండ్ కో దందా. దీనికి అక్కడా ఇక్కడ ఏమి లేదు. తిరుపతి లోని రుయా ఆసుపత్రిలోని ల్యాబ్ నిర్వహణ వరకు నడిచింది. వాస్తవానికి ప్రభుత్వాసుపత్రిలోని ల్యాబ్ నిర్వహణ లను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించింది చంద్రబాబు సర్కార్. అయితే తిరుపతిలో మాత్రం లక్ష్మి వెంకటేశ్వర ల్యాబ్ కి ఇచ్చింది. అదేమిటి రాష్ట్రం మొత్తం ఒక్కరికే ఇవ్వలిసింది ఇక్కడ మాత్రం ఆ తేడా ఏమిటి అని విచారణ మొదలు పెట్టిన కలెక్టర్ కి దిమ్మతిరిగే నిజాలు తెలిసి తక్షణం కాంట్రాక్ట్ ను రద్దు చేసేసి ఆ ఆసుపత్రి ల్యాబ్ నిర్వహించుకునే లా ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్.

ఐదేళ్ళలో 15 కోట్లు మింగేశారు …

నిజానికి రుయా ఆసుపత్రిలో నాలుగు కోట్ల రూపాయలతో అత్యాధునిక ల్యాబ్ సదుపాయాలు వున్నాయి. వీటిని నిర్వహించే సిబ్బంది వున్నారు. అయినా కానీ తండ్రి కోడెల శివప్రసాద్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడెల శివరాం తన బినామీ లక్ష్మి వెంకటేశ్వరా ల్యాబ్ కి అప్పగించేలా వ్యవహారం నడిపించారు. ఇక్కడ సాధారణంగా హెచ్ ఐ వి టెస్ట్ కి 150 రూపాయలు అవుతుంటే 850 రూపాయలను, థైరాయిడ్ టెస్ట్ కి 80 రూపాయలు వాస్తవంగా అయితే 350 రూపాయలు వసులు చేసింది కే టీం. దాంతో నెలకు 15 లక్షల రూపాయలు వసులు చేయాలిసిన మొత్తాన్ని 40 లక్షల రూపాయలు, అంటే ఏడాదికి 15 కోట్ల రూపాయలు మింగేసింది లక్ష్మి వెంకటేశ్వర ల్యాబ్. దాంతో కోడెల శివప్రసాద్ల కుటుంబం మెడకు మరో ఉచ్చు చుట్టుకున్నట్లు అయ్యింది.

Tags:    

Similar News