కోడెల కొడుకుపై బాబుకు కోపం పోయిందే?
తెలుగు రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలుగా.. ఇంకా చెప్పాలంటే గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పటకీ దివంగత మాజీ మంత్రి, సమైక్యాంధ్ర తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావుది తిరుగులేని ప్రస్థానం. [more]
తెలుగు రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలుగా.. ఇంకా చెప్పాలంటే గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పటకీ దివంగత మాజీ మంత్రి, సమైక్యాంధ్ర తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావుది తిరుగులేని ప్రస్థానం. [more]
తెలుగు రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలుగా.. ఇంకా చెప్పాలంటే గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పటకీ దివంగత మాజీ మంత్రి, సమైక్యాంధ్ర తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావుది తిరుగులేని ప్రస్థానం. కోడెల లేకపోయినా జిల్లా రాజకీయాల్లో ఆయన స్టైల్ ప్రత్యేకమే. సాధారణ డాక్టర్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా… మంత్రిగా, స్పీకర్‌గా ఎన్నో పదవులు అధిరోహించిన కోడెల జీవితం ముగింపు మాత్రం చాలా బాధాకరం. 2004 వరకు నరసారావుపేటలో తిరుగులేని రాజకీయం చేసిన ఆయన ఆ తర్వాత రాజకీయ రేసులో వెనకపడిపోయారు. 2014లో ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో బయట పడ్డారు. స్పీకర్‌గా ఉన్నా నియోజకవర్గంలో ఆయన కుమారుడు కోడెల శివరాం, కుమార్తెపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం ఆయన రాజకీయ కెరీర్‌ను చరమాంకంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది.
కుటుంబాన్ని పక్కన పెట్టేస్తారని….
చివరకు గత ఎన్నికల్లో కోడెల అంబటి రాంబాబు చేతిలో ఓడిపోవడంతో పాటు… చివరకు ఆయన కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న అవమాన భారంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల లాంటి రాజకీయ నేతకు చివర్లో ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. కోడెల మనోవేదనకు గురవ్వడం వెనక ఆయన కుమారుడు కోడెల శివరాం, కూతురు చర్యలే ప్రధాన కారణమన్న విమర్శలే ఎక్కువుగా వచ్చాయి. ఇక కోడెల మరణాంతరం ఇంత వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయన వారసుడు కోడెల శివరాం రాజకీయం ఉంటుందా ? ముగుస్తుందా ? అన్న సందేహాలు వచ్చాయి. చంద్రబాబు కూడా కోడెల ఫ్యామిలీని పూర్తిగా పక్కన పెట్టేస్తారనే టీడీపీ వర్గాలు కూడా అనుకున్నాయి.
ప్రజలకు చేరువయ్యేందుకు….
అయితే సత్తెనపల్లిలో తాజా పరిణామాలు చూస్తే చంద్రబాబు కూడా పూర్తిగా కోడెల శివరాంని పక్కన పెట్టే ఉద్దేశంలో ఉన్నట్టు కనిపించలేదు. పై నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా ? లేదా కోడెల వారసుడు శివరాం సొంతంగానే యాక్టివ్ అవుతున్నాడో ? కాని సత్తెనపల్లిలో ప్రస్తుతం ఏ కార్యక్రమం జరిగినా కోడెల శివరాం చురుగ్గా ఉంటున్నారు. కార్యకర్తలకు కష్టం వస్తే ఆదుకోవడంతో పాటు పరామర్శలకు, పంట నష్టపోయిన రైతుల వద్దకు పార్టీలతో సంబంధం లేకుండా పరామర్శిస్తున్నారు. తన అనుచరగణాన్ని కాపాడుకోవడంతో పాటు యువతకు కూడా చేరువ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటి వరకూ బాబు….
ఇక చంద్రబాబు కూడా కోడెల ఫ్యామిలీని వదిలినట్టు లేరన్న సందేహాలు ఉన్నాయి. అందుకే జిల్లాలో ఖాళీ అయిన మాచర్ల, బాపట్ల, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల కన్వీనర్లను భర్తీ చేసిన చంద్రబాబు సత్తెనపల్లిని మాత్రం తేల్చలేదు. ఇదే సీటు కోసం అటు రాయపాటి వారసుడు రంగారావుతో పాటు మరో యువనేత మల్లి కూడా రేసులో ఉన్నారు. ఇక కోడెల లేకపోయినా జిల్లాలో అనుచరగణం ఎక్కువే. ఈ పరిణామాల క్రమంలో కోడెల వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ బాబు కోడెల శివరాంకు లైఫ్ ఇస్తారా ? లేదా ? అన్నదే చూడాలి.