రేంజ్ ఏంటో చూపిస్తున్నారా?

ఆయనకు మంత్రులతో సంబంధంలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పనిలేదు. తన పని తాను చూసుకుంటారు. తనవర్గాన్ని మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయనే విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి. [more]

Update: 2019-12-01 06:30 GMT

ఆయనకు మంత్రులతో సంబంధంలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పనిలేదు. తన పని తాను చూసుకుంటారు. తనవర్గాన్ని మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయనే విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి. ఇటు వ్యాపారాలు, అటు రాజకీయాలను దశాబ్దాలుగా ఒంటిచేత్తో నడుపుతూ వస్తున్నారు. తాను ముందే పార్టీలో చేరినా పదవి దక్కక పోవడం ఆయన్ను కలచి వేస్తుంది. ఇంతకాలం తన వర్గంగా ముద్రపడిన ఎమ్మెల్యేలు సయితం ఆయనకు దూరంగా ఉంటున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి జగన్ పట్ల మాత్రం సానుకూలంగా ఉన్నారు.

జగన్ గుర్తిస్తారని….

జగన్ ఎప్పటికైనా తన శ్రమను గుర్తిస్తారన్న నమ్మకంతో కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. కోలగట్ల వీరభద్రస్వామికి, మంత్రి బొత్స సత్యనారాయణలకు ఒకరంటే ఒకరికి పడదు. పైకి నవ్వుతూ కన్పిస్తున్నా ఇద్దరూ కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతారన్న సెటైర్లు విన్పిస్తాయి. కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స సత్యనారాయణలు ఇద్దరూ తొలుత కాంగ్రెస్ లోనే ఉన్నారు. సత్తిబాబు మాత్రం పార్టీలో ఎదిగారు. కోలగట్ల వీరభద్రస్వామికి మాత్రం అంతస్థాయి లభించలేదు. అయినా కోలగట్ల వీరభద్రస్వామి ఎక్కడా తగ్గరు. తాను అనుకున్నదే చేస్తారు.

ఇద్దరూ ఒకే పార్టీలో…..

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ లో ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి వెంటనే జగన్ పార్టీలో చేరిపోయారు. బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా తాను జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలనుకున్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత బొత్స సత్యనారాయణ కూడా వైసీపీలోకి వచ్చారు. అయితే బొత్స సత్తిబాబు వచ్చినా జగన్ మాత్రం కోలగట్ల వీరభద్రస్వామికి ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ జిల్లాలో సత్తిబాబు ఎక్కడైనా వేలు పెట్టుకోవచ్చుకాని తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే ఊరుకోనని బహిరంగంగానే కోలగట్ల వీరభద్రస్వామి హెచ్చరిస్తున్నారు.

ఒంటరిగా మారినా…..

గతంలో పుష్పశ్రీవాణి కోలగట్ల వీరభద్రస్వామి గ్రూపులో ఉండేవారు. అయితే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పుష్పశ్రీవాణి కోలగట్ల ను దూరం పెట్టారు. గతంలో ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలు సయితం బొత్సకు దగ్గరయ్యారు. తాజాగా విజయనగరంలో జరిగిన ఒక సమావేశానికి అందరూ వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయినా కోలగట్ల దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా మంత్రులను ఆహ్వానించకుండా ఆయన ఒక్కడే చేసుకుంటున్నారు. ఇలా కోలగట్ల వీరభద్రస్వామి ఒక రేంజ్ లో బొత్సకు వార్నింగ్ లు ఇస్తుండటంపై జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News