కోలగట్లకు ఫిక్స్… ప్రకటించడమే తరువాయి అట

జగన్ మరో నలుగురికి కీలక పదవులు ఇవ్వనున్నారు. రాష‌్ట్రంలో నాలుగు జోన్లను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు నాలుగు ఉండటంతో నలుగురికి కీలక [more]

Update: 2020-08-16 11:00 GMT

జగన్ మరో నలుగురికి కీలక పదవులు ఇవ్వనున్నారు. రాష‌్ట్రంలో నాలుగు జోన్లను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు నాలుగు ఉండటంతో నలుగురికి కీలక పదవులు దక్కనున్నాయి. ఈ నలుగురు ఎవరన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ హోదా ఉండటంతో మంత్రి పదవికి స్థాయలో పదవి ఉండటంతో పోటీ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆశావహులు పెద్ద సంఖ్యలో పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అనేక మంది పోటీలో…..

ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలిపై అనేక మంది పోటీ పడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది ఆశావహులు కన్పిస్తున్నారు. అక్కడ సీనియర్ నేతలు కూడా ఉండటం ఇందుకు కారణమని చెప్పాలి. ప్రధానంగా విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల వీరభద్రస్వామి పేరు విన్పిస్తుంది. నిజానికి కోలగట్ల వీరభద్రస్వామికి మంత్రి పదవి దక్కాల్సి ఉంది. తొలి నుంచి జగన్ ను నమ్ముకున్న వ్యక్తి కావడంతో ఆయనకు మంత్రి పదవి ఇస్తారని అందరూ భావించారు.

స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే….

కానీ కోలగట్ల వీరభద్రస్వామికి అప్పట్లో బొత్స సత్యనారాయణ అడ్డుపడినట్లు టాక్. అందుకే వెల్లంపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చారంటారు. కోలగట్ల వీరభద్రస్వామికి ఏదో ఒక పదవి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఉన్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థలు జరిగినట్లయితే ఆయన కూతురు శ్రావణికి దక్కి ఉండేది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకూ స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. అంటే వచ్చే ఏడాది మార్చి తర్వాతే. అప్పటి వరకూ ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది.

విజయనగరం జిల్లాకే…..

మరోవైపు పొరుగునే ఉన్న శ్రీకాకుళం జల్లాకు ఎక్కువ పదవులు దక్కాయి. రెండు మంత్రి పదవులతో పాటు, స్పీకర్ పదవి కూడా ఆ జిల్లాకు రావడంతో విజయనగరం జిల్లాకే ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి ఛైర్మన్ పదవిని విజయనగరం జిల్లాకు ఇస్తారంటున్నారు. అందుకే మరోసారి కోలగట్ల వీరభద్రస్వామి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈసారైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా కోలగట్లకు పదవి దక్కుతుందని ఆయన అనుచరులు గట్టిగా నమ్ముతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News