ఆ మాజీ ఎమ్మెల్యేగారు అలిగారా? జెండా ఎగరడం లేదు
గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి వరుస విజయాలు దక్కించుకున్న నాయకుడు.. కొమ్మాలపాటి శ్రీధర్. ఇక్కడ బలమైన కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలకు రాజకీయంగా చెక్ పెట్టారు. పెదకూరపాడులో [more]
గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి వరుస విజయాలు దక్కించుకున్న నాయకుడు.. కొమ్మాలపాటి శ్రీధర్. ఇక్కడ బలమైన కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలకు రాజకీయంగా చెక్ పెట్టారు. పెదకూరపాడులో [more]
గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి వరుస విజయాలు దక్కించుకున్న నాయకుడు.. కొమ్మాలపాటి శ్రీధర్. ఇక్కడ బలమైన కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలకు రాజకీయంగా చెక్ పెట్టారు. పెదకూరపాడులో ఐదుసార్లు వరుస విజయాలు సాధించిన కన్నా 2009 ఎన్నికలకు ముందు కొమ్మాలపాటి శ్రీధర్ దూకుడుకు జడిసే గుంటూరు వెస్ట్‌కు మారిపోయారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీలో తనకంటూ.. జిల్లాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీధర్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే, నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జివి.ఆంజనేయులుకు వియ్యంకుడు కూడా కావడంతో వీళ్ల రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగానే హైలెట్ అయ్యేది. అయితే.. ఆయన గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్రావుపై ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి కొమ్మాలపాటి శ్రీధర్ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పైగా నియోజకవర్గంలో ఉండాలని .. చంద్రబాబు పదే పదే చెప్పినా.. ఇప్పటి వరకు ఆయన పట్టించుకోలేదు.
గుంటూరులోనే ఉంటూ….
ఇక, జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలకు కూడా ఏనాడూ ఆయన హాజరైంది లేదు. మరి ఎక్కడున్నారు ? శ్రీధర్‌కు హైదరాబాద్‌లో పలు వ్యాపారాలు ఉన్నాయి. ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారా ? అని ఆరా తీస్తే లేదు గుంటూరులోనే ఉంటున్నారని పార్టీ నేతలు చెపుతున్నారు. అయితే నియోజకవర్గం పెదకూరపాడు వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. తనకు వచ్చే ఎన్నికల్లో అక్కడ పోటీ చేయాలని కూడా లేదని.. తన సన్నిహితులతో అంటున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు పట్ల తనకు అత్యంత గౌరవం ఉందని చెప్పుకొనే నేతలలో కొమ్మాలపాటి శ్రీధర్ ఒకరు. అంతేకాదు.. చంద్రబాబు కనుసన్నల్లోనే ఆయన నడుస్తారని పేరు కూడా తెచ్చుకున్నారు.
కమ్మ సామాజికవర్గం….
అయితే.. గత చంద్రబాబు పాలనలో తనకు మంత్రి పదవి రాకుండా పోయిందనే ఆవేదన ఆయనలో ఉంది. మళ్లీ ప్రభుత్వం వస్తే నీకు మంచి పదవి ఇస్తానని అప్పట్లోనే చంద్రబాబు కొమ్మాలపాటి శ్రీధర్ ని ఊరడించారని సమాచారం. అయితే మళ్లీ ప్రభుత్వం రాలేదు.. ఇటు శ్రీధరూ గెలవలేదు. కొమ్మాలపాటి శ్రీధర్ మాత్రం తనకు నియోజకవర్గం కలిసి రాలేదని.. వచ్చే ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ కావాలని కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పెదకూరపాడు రాజకీయాలకు ఆయన పూర్తి దూరంగా ఉంటున్నారని కేడర్ గగ్గోలు పెడుతున్నారు. నియోజకవర్గంలో బలమైన కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువ.
సొంత సామాజికవర్గం నేతలే..?
వీరిలోనే కొందరు నేతలు కొమ్మాలపాటి శ్రీధర్‌కు వ్యతిరేకంగా మారారు. గత ఎన్నికలకు ముందే వీరంతా కొమ్మాలపాటి శ్రీధర్‌కు టిక్కెట్ రాకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ కమ్మ నేతల్లోనే కొందరు నంబూరు శంకర్రావుకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు చక్కబడలేదు సరికదా ? పార్టీలోనే శ్రీధర్‌ను వ్యతిరేకిస్తోన్న వారు మరింత గుర్రుగా ఉన్నారు. దీంతో ఆయన గుంటూరు వెస్ట్‌పై కన్నేశారని తెలుస్తోంది. మొన్నటి కార్పోరేషన్ ఎన్నికలకు ముందు నుంచే ఆయన ఈ నియోజకవర్గంలో చాపకింద నీరులా వ్యవహారాలు చక్కబెట్టారు. మరి శ్రీధర్ పొలిటికల్ రూటు వచ్చే ఎన్నికల నాటికి ఎలా ? ఉంటుందో ? చూడాలి.