ఆయనకే ఏపీ స్పీకర్ చాన్స్ ?

తండ్రి స‌భాపతి చేశారు. కుమారుడు ఉప సభాపతి దాకా వచ్చారు అని ఏడాది క్రితం రాజకీయ సెంటిమెంట్ ని తలచుకుంటూ వినిపించిన మాట ఇది. ఆయన ఎవరో [more]

Update: 2020-07-18 08:00 GMT

తండ్రి స‌భాపతి చేశారు. కుమారుడు ఉప సభాపతి దాకా వచ్చారు అని ఏడాది క్రితం రాజకీయ సెంటిమెంట్ ని తలచుకుంటూ వినిపించిన మాట ఇది. ఆయన ఎవరో కాదు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి. ఆయన తండ్రి కోన ప్రభాకరరావు నాలుగు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీకి స్పీకర్ గా పనిచేశారు. ఆయన చాలా సీనియర్ నేతగా ఉండేవారు. మళ్లీ ఇన్నాళ్ళకు స్పీకర్ కుర్చీ ఆ కుటుంబం ఎక్కిందని ఆయన అనుచరులు, అభిమానులు సంతోషించారు. అయితే కోన రఘుపతికి ఏకంగా స్పీకర్ పదవే వరించి వస్తుందనుకుంటే డిప్యూటీ స్పీకర్ గానే చేశారు. అయితే ఇపుడు ఆ సుముహూర్తం దరిదాపుల్లోకి వచ్చినట్లేనని అంటున్నారు. మరి ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారం కధేంటి అంటే చాలానే ఉందిట.

అమాత్యా అని…?

తనను అంతా అధ్యక్షా అని పిలవడం గౌరవంగా ఉన్నా తమ్మినేనికి అది సంత్రుప్తిని ఇవ్వడంలేదుట. అంతా తనను అమాత్యా అని పిల‌వాలన్న ధ్యాస, ఆశ ఆయనలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దాన్ని ఆయన ఎక్కడా మనసులో దాచుకోకుండా బయటపెట్టేసుకున్నారు. ఈ మధ్యనే జగన్ ని సతీసమేతంగా కలసి మరి తన విన్నపాన్ని తెలియచేశారని కూడా ప్రచారం సాగుతోంది. తమ్మినేని గతంలో ఎన్నోసార్లు మంత్రిగా చేసినా కూడా మరోసారి ఆ కుర్చీ ఎక్కాలనుకుంటున్నారు. డెబ్బయ్యేళ్ళ వయసులో ఉన్న ఈ పెద్దాయన తన జీవిత చరమాంకంలో మంత్రిగా అధికారం చలాయించి రాజకీయాలలో రిటైర్ కావాలని అనుకుంటున్నారుట.

దూకుడే ప్లస్ …..

ఇక శ్రీకాకుళం రాజకీయాలు చూస్తే బీసీ కాళింగులు, బీసీ వెలమల మధ్య చిరకాల రాజకీయ పోరు ఉంది. కాళింగులు కాంగ్రెస్ లో చాలా దర్జాగా ఉండేవారు. వారికి అక్కడ పెద్ద పీట వేసిన చరిత్ర ఉంది. దశాబ్దాల పాటు ఆ సామాజికవర్గానికి చెందిన బొడ్డేపల్లి రాజగోపాల్ ఎంపీగా చేశారు. ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అయిన వారు ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఈ సామాజిక సమీకరణలు మారాయి. ఆయన సిక్కోలులో వెలమలను చేరదీయడంతో రాజకీయంగా వారి హవా పెరిగింది. దాంతో తప్పనిసరిగా కాంగ్రెస్ కూడా అదే ట్రెండ్ ని ఫాలో అయింది. దాంతో కాళింగులు అన్నీ ఉండి కూడా పదవులు లేక పొలిటికల్ గా అల్లాడుతున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేనికి మంత్రి పదవి ఇస్తే అచ్చెన్నాయుడు మీద గట్టిగ విరుచుకుపడతారని, జిల్లా రాజకీయలను ఒక లెక్కలోకి తెస్తారని జగన్ నమ్ముతున్నారుట. అందుకే ఆయనకు మంత్రి పదవి ఖాయమని అంటున్నారు.

స్పీకర్ ఆయనే….

ఇక తమ్మినేనిని మంత్రిగా చేస్తే స్పీకర్ పదవి కచ్చితంగా కోన రఘుపతికి దక్కుతుంది అంటున్నారు. అంటే తన తండ్రి చేసిన స్పీకర్ పదవిలోకి ఏడాది తిరగకుండానే కుమారుడు కుదురుకుంటారన్నమాట. కోన రఘుపతికి ఆ పదవి ఇవ్వడం ద్వారా స్పీకర్ పదవి వివాదం కాకుండా ఉంటుందని, మౌనంగా ఆయన ఉంటారని, పైగా సభాపతి నియమాలు, మర్యాదా కాపాడుతారని అంటున్నారు. అలాగే బ్రాహ్మణ సామాజికవర్గానికి అతి కీలకమైన పదవితో న్యాయం చేసినట్లు అవుతుందని అంటున్నారు. ఇన్ని రకాలుగా ఆలోచించిన మీదటనే జగన్ తమ్మినేనికి మంత్రి పదవి ఇస్తూ కోన రఘుపతికి అక్కడ లైన్ క్లియర్ చేస్తున్నారని చెబుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News