kona raghupathi : సొంత పార్టీలోనే ఇంత అసమ్మతా?

నియోజకవర్గంలో వరసగా గెలుస్తూ పట్టు నిలుపుకుంటున్న కోన రఘుపతికి బాపట్ల నియోజకవర్గంలో ఎదురుగాలులు వీస్తున్నాయి. ఆయనపై సొంత పార్టీలోనే అసంతృప్తి మొదలయింది. మరోవైపు ఇక్కడ టీడీపీ బలోపేతం [more]

Update: 2021-10-05 08:00 GMT

నియోజకవర్గంలో వరసగా గెలుస్తూ పట్టు నిలుపుకుంటున్న కోన రఘుపతికి బాపట్ల నియోజకవర్గంలో ఎదురుగాలులు వీస్తున్నాయి. ఆయనపై సొంత పార్టీలోనే అసంతృప్తి మొదలయింది. మరోవైపు ఇక్కడ టీడీపీ బలోపేతం అవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ నేత వేగేశ్న నరేంద్ర వర్మ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నారు. సహజంగా అధికార పార్టీ పై వస్తున్న అసంతృప్తిని ఆయన పార్టీ వైపునకు మళ్లిస్తున్నారు.

టీడీపీకి ఇక్కడ…

గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండేది. ఇక్కడ మూడు సార్లు మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఏడుసార్లు కాంగ్రెస్ గెలచింది. 2014 నుంచి వరసగా కోన రఘుపతి వైసీపీ నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఆయన తండ్రి కోనప్రభాకర్ రావుకు ఉండే ఇమేజ్ ఈయన విజయానికి ప్రధాన కారణంగా చెప్పాలి. డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకున్న కోన రఘుపతి నియోజకవర్గ అభివృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టింది లేదు. మెతక స్వభావం ఆయనను రాజకీయంగా దెబ్బతీస్తుందంటారు.

తక్కువ మెజారిటీతోనే…

గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కోన రఘుపతి తక్కువ మెజారితో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ కుమార్ పై ఐదు వేల ఓట్ల ఆధిక్యత మాత్రమే లభించింది. ఈసారి వాటిని అధిగమించి విజయం సాధిస్తామన్న ధీమాలో టీడీపీ ఉంది. బాపట్లలో టీడీపీ బలం పుంజుకోవడానికి కారణం వేగేశ్న నరేంద్ర వర్మ అనే చెప్పాలి. ఆయన సొంత ఖర్చులతో పార్టీని ముందుకు నడుపుతున్నారు. అయితే గత ఎన్నికలలో పోటీ చేసిన ఓటమి పాలయిన అన్నం సతీష్ మాత్రం కనపడటం లేదు.

సీనియర్ నేతలు….

ఇక కోన రఘుపతికి సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. గత ఎన్నికల్లోనే ఆయనకు టిక్కెట్ ఇవ్వవద్దంటూ లోటస్ పాండ్ వద్ద ధర్నా చేశారు. కానీ జగన్ ఆయనకే కేటాయించారు. దీనికి తోడు పార్టీలో సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి వర్గం కూడా గుర్రుగా ఉంది. వైసీపీలో లుకలుకలను క్యాష్ చేసుకునే దిశగా టీడీపీ పావులు కదుపుతుంది. అయితే ఇక్కడ యాంటీ టీడీపీ ఓటు ఎక్కువ కావడంతో విభేదాలను పరిష‌్కరించుకుంటే మరోసారి విజయం పెద్ద కష్టమేమీ కాదు. కానీ వైసీపీలో విభేదాలు ఎంత వరకూ పరిష్కారం అవుతాయన్నది చూడాలి.

Tags:    

Similar News