కొండా టార్గెట్ అదే…ఈసారైనా నెగ్గుకొస్తారా?
కొండా సురేఖ గత రెండున్నరేళ్ల నుంచి రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. 2018 ఎన్నికలకు ముందు కొండా సురేఖ దంపతులు టీఆర్ఎస్ ను వీడారు. చివరకు కాంగ్రెస్ లో [more]
కొండా సురేఖ గత రెండున్నరేళ్ల నుంచి రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. 2018 ఎన్నికలకు ముందు కొండా సురేఖ దంపతులు టీఆర్ఎస్ ను వీడారు. చివరకు కాంగ్రెస్ లో [more]
కొండా సురేఖ గత రెండున్నరేళ్ల నుంచి రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. 2018 ఎన్నికలకు ముందు కొండా సురేఖ దంపతులు టీఆర్ఎస్ ను వీడారు. చివరకు కాంగ్రెస్ లో చేరారు. అయినా ఆమె ఓటమి పాలవ్వడంతో పాటు కాంగ్రెస్ కు అధికారం దక్కలేదు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు అధికారం వస్తుందో? లేదో? అన్నది డౌటే. అయితే తాను గతంలో మాదిరి తప్పులు చేయనని కొండా సురేఖ గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
రాజకీయంగా…..
కొండా సురేఖ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మరో రెండున్నరేళ్లు ఆమె రాజకీయంగా ఖాళీగా ఉండాల్సిందే. అయితే అనుకోని విధంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమెపై వత్తిడి వచ్చింది. బీసీ సామాజికవర్గం కావడం, ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడటంతో కొండా సురేఖ అయితే హుజూరాబాద్ లో బలమైన నేత అవుతారని కాంగ్రెస్ పెద్దలు భావించారు. ఆమెకే టిక్కెట్ ఇవ్వాలని రెడీ అయ్యారు.
వరంగల్ ను వీడనని…
అయితే కొండా సురేఖ కాంగ్రెస్ నేతల ఆశలపై నీళ్లు చల్లారు. తాను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినా వరంగల్ ను వదిలేది లేదని స్పష్టం చేశారు. గతంలోనూ తాను పరకాలకు వెళ్లి తప్పు చేశానని, మరోసారి ఆ తప్పు చేయనని కొండా సురేఖ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేశాయి. వరంగల్ ను వదిలేది లేదని చెప్పిన కొండా సురేఖ ను హుజూరాబాద్ ప్రజలు ఎలా ఆదరిస్తారు? తనకు పోటీ చేయడం ఇష్టం లేకనే ఇలా వ్యాఖ్యానించారని పిస్తుంది.
వచ్చే ఎన్నికల నాటికి…
వచ్చే ఎన్నికలు కొండా సురేఖకు ప్రతిష్టాత్మకం. ఈసారి కూడా వరంగల్ నుంచే పోటీ చేయాలని కొండా సురేఖ గట్టిగా భావిస్తున్నారు. వీలయితే తమ కుటుంబంలో రెండు టిక్కెట్లు దక్కించుకోవాలన్న ప్రయత్నంలో కొండా సురేఖ ఉన్నారు. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో అలా కామెంట్స్ చేశారంటున్నారు. మొత్తం మీద కొండా సురేఖ టార్గెట్ అంతా వరంగల్ పైనే ఉంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.