Konda surekha: తెలివిగా తప్పుకున్నారుగా?

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ తెలివైన నిర్ణయం తీసుకున్నట్లే కన్పిస్తుంది. ఇప్పటికే చేసిన తప్పులను మరోసారి చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో [more]

Update: 2021-10-09 09:30 GMT

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ తెలివైన నిర్ణయం తీసుకున్నట్లే కన్పిస్తుంది. ఇప్పటికే చేసిన తప్పులను మరోసారి చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయమని పార్టీ హైకమాండ్ కు తేల్చి చెప్పారు. తాను వరంగల్ కే పరిమితమవుతానని అక్కడ ప్రజలకు బలమైన సంకేతాలను కూడా కొండా సురేఖ పంపించినట్లయింది.

టిక్కెట్ ఇస్తామంటే….?

ఉప ఎన్నికల్లో జాతీయ పార్టీ టిక్కెట్ ఇస్తామనడమంటే ఆషామాషీ కాదు. గెలుపోటములు పక్కన పెడితే బరిలోకి దిగి ప్రత్యర్థులను ఎదుర్కొన్నారన్నది ఆ నియోజకవర్గం చరిత్రలో నిలచిపోతుంది. కొండా సురేఖ అటువంటి ఆఫర్ ను వదులుకున్నారు. దీనికి ప్రధాన కారణం తాను వరంగల్ నుంచి దూరమవుతానని, మరో కారణం అనవరంగా ఓటమి పాలయి ఎందుకు రాజకీయంగా ఇబ్బంది పడాలని?

తొలుత ఒక ప్రతిపాదన….

ఈ రెండు కారణాలతో కొండా సురేఖ బరి నుంచి తప్పుకున్నారు. తొలుత కొండా సురేఖ తాను హుజూరాబాద్ లో పోటీ చేయాలంటే తనకు వచ్చే ఎన్నికల్లో వరంగల్ లో టిక్కెట్ ఇస్తామని హామీ ఇవ్వాలని, హుజూరాబాద్ కే పరిమితం చేయకూడదని కోరారు. దీనికి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుంది. కాంగ్రెస్ అంగీకరించందనే కొండా సురేఖ ఈ ప్రతిపాదనను పెట్టారు. అయితే మరోసారి తమ కుటుంబానికి మూడు సీట్లు వరంగల్ ప్రాంతంలో ఇవ్వలని కోరారు.

కాంగ్రెస్ అంగీకరించక పోవడంతో….

దీనికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదు. హుజూరాబాద్ లో పోటీ చేయకూడదన్న కారణంగానే కొండా సురేఖ ఈ మూడు నియోజకవర్గాల ప్రతిపాదనను పెట్టారు. ఎటూ కాంగ్రెస్ అంగీకరించదని తెలుసు. అందుకే తెలివిగా ఈ ప్రతిపాదనను పెట్టి తప్పు పార్టీపై నెట్టి తాను బరి నుంచి తప్పుకున్నారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ తరుపునుంచి ఎవరు పోటీ చేసినా మూడో స్థానానికే పరిమితం కావాల్సి ఉంటుంది.

Tags:    

Similar News