కోటంరెడ్డి కాలు అటు కదిలిందేమిటో?

ఏ నేత అయినా తాను అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే ప్రజాబలానికి తోడు క్యాడర్ మద్దతు అవసరం. క్యాడర్ మనస్ఫూర్తిగా పనిచేస్తేనే విజయం లభిస్తుంది. గత ఎన్నికల్లో రాష్ట్ర [more]

Update: 2021-09-24 02:00 GMT

ఏ నేత అయినా తాను అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే ప్రజాబలానికి తోడు క్యాడర్ మద్దతు అవసరం. క్యాడర్ మనస్ఫూర్తిగా పనిచేస్తేనే విజయం లభిస్తుంది. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్ చెమటోడ్చడం వల్లనే వైసీపీకి అంతటి ఘన విజయం లభించింది. గత రెండేళ్లుగా అభివృద్ధి పనులు జరగక, నియోజకవర్గంలోకి వెళ్లలేని నేతలు క్యాడర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ప్రజా సమస్యలను ….

నియోజకవర్గంలో ప్రజాసమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా 42 రోజుల పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 26 డివిజన్లలో ఆయన పర్యటన ఖరారయింది. ప్రజా సమస్యలను అధ్యయనం చేయడంతో పాటు వాటిలో కొన్నింటికి వెంటనే పరిష్కారం చూపాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భావిస్తున్నారు. కొన్నింటికి అక్కడక్కడే పరిష్కారం చూపడంతో జనం కూడా మెచ్చుకుంటున్నారు.

కార్యకర్తల ఇంటికి…

ఇక ప్రజాసమస్యలతో పాటు కార్యకర్తలను కూడా కలవనున్నారు. దీనికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ” నేను నా కార్యకర్త ” అని పేరు పెట్టారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్త ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన నియోజకవర్గం పరిధిలోని 26 డివిజన్లలో 3,516 మంది కార్యకర్తలను గుర్తించారు. వీళ్ల అందరి ఇంటికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్లనున్నారు. వారితో కలసి ముచ్చటించనున్నారు.

మూడోసారి విజయం కోసం…

కార్యకర్తలతో కలసి భోజనం చేయనున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటారు. వారిలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికి వరసగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయం సాధించేందుకు మరోసారి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటు ప్రజాసమస్యలను, అటు క్యాడర్ ను మంచి చేసుకునే ప్రయత్నంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.

Tags:    

Similar News