కొత్తపల్లికి కొత్త కష్టాలు…!!!

కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన కాపు నాయ‌కుడు. కాపు కార్పొరేష‌న్‌కు మాజీ చైర్మన్ కూడా అయితే, కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు వేసిన రాజ‌కీయ [more]

Update: 2019-08-31 14:30 GMT

కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన కాపు నాయ‌కుడు. కాపు కార్పొరేష‌న్‌కు మాజీ చైర్మన్ కూడా అయితే, కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు వేసిన రాజ‌కీయ అడుగులు ఇప్పుడు ఆయ‌న‌కు ద‌శ దిశ లేకుండా చేస్తున్నాయ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజ‌కీయంగా ఒక్క పార్టీలోనూ ఆయ‌న ప‌ట్టు మ‌ని ప‌దేళ్లు ప‌నిచేసింది లేదు. ఆదిలో టీడీపీలో ఉన్న స‌మ‌యంలో చంద్రబాబు కేబినెట్ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీ ఓడిపోయిన 2004 ఎన్నిక‌ల్లో కూడా కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు టీడీపీ నుంచి విజ‌యం సాధించారు. 2009లో ప్రజారాజ్యంలో త‌ర్వాత కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేయ‌డంతో వైసీపీలో చేరిపోయారు.

ఉప ఎన్నికల్లో గెలిచి….

2012లో న‌ర‌సాపురం ఉప ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కారు. 2014లో వైసీపీలో పోటీ ఓట‌మి.. త‌ర్వాత టీడీపీలో చేరిపోయారు. ఇలా వ‌రుస పెట్టి ఆయ‌న పార్టీలు మారుతూనే ఉన్నారు. 2004లో టీడీపీ, 2009లో ప్రజారాజ్యం, 2012 ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, 2014లో వైసీపీ ఇలా ప్రతి ఎన్నిక‌కు ఆయ‌న పార్టీ మారి పోటీ చేస్తూ వ‌చ్చారు. ఈ క్రమంలోనే 2017లో కాపు కార్పొరేష‌న్ చైర్మన్ ప‌ద‌విని సొంతం చేసుకున్నారు కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు. అయితే, టీడీపీ తాజా ఎన్నిక‌ల స‌మ‌యంలో కొత్తప‌ల్లిని ప‌క్కన పెట్టింది. దీంతో మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిపోయాడు కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు.

ఏ పదవీ దక్కే ఛాన్స్ లేదని…..

కానీ, ఎలాంటి హామీ కూడా లేకుండానే జ‌గ‌న్ ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకోవ‌డంతో ఇప్పుడు నిమిత్త మాత్రుడిగా ఉండిపోయారు కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు. పోనీ.. త‌న పాత ప‌ద‌వి.. కాపు కార్పొరేష‌న్ చైర్మన్‌గా అయినా జ‌గ‌న్ నియ‌మించ‌క పోతాడా? అంటే.. అది కూడా రాజ‌న‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కం పూడి రాజాకు క‌ట్టబెట్టారు జ‌గ‌న్ . రాజా కొత్త ప‌ల్లి సుబ్బారాయుడుకి వ‌రుస‌కు అల్లుడే అవుతాడు. దీంతో కొత్తప‌ల్లి ఆశ‌లు ఆదిలోనే వాడిపోయాయి. పోనీ.. ఇంకేదైనా కీల‌క మైన ప‌ద‌వి ద‌క్కుతుందా? అనే ఆలోచ‌న‌లో ఉండ‌గానే.. ప‌శ్చిమ గోదారిలో చాలా మంది వైసీపీ నాయ‌కులు కీల‌కంగా ఉన్నారు. దీంతో నేరుగా కొత్త ప‌ల్లి సుబ్బారాయుడుకి ఎలాంటి ప‌ద‌వీ ద‌క్కే ఛాన్స్ లేదు.

పరిస్థితులు సహకరించక…..

పైగా కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు అడ్డా అయిన న‌ర‌సాపురంలో ముదునూరి ప్రసాద‌రాజు వైసీపీలో కీల‌కంగా ఉన్నారు. ఆయ‌న వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు. ఆయ‌న్ను కాద‌ని అక్కడ సుబ్బారాయుడికి ప్రయార్టీ ఇచ్చే అవ‌కాశ‌మే లేదు. క్షత్రియ కోటాలో మంత్రిగా రెండున్నరేళ్ల త‌ర్వాత ఈయ‌నే మంత్రి అవుతారు. ఈ నేప‌థ్యంలో కొత్తప‌ల్లికి కొత్తగా రాజకీయాలు చేయాల‌ని ఉన్నా.. ప‌రిస్థితిలు ఏమాత్రమూ ఆయ‌న‌కు స‌హ‌క‌రించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News