ఆ టీడీపీ నేత‌తో కోట్ల సుజాత‌మ్మకు కొత్త చిక్కు ?

క‌ర్నూలు జిల్లా ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌మ్ముళ్ల మ‌ధ్య టికెట్ పోరు అప్పుడే మొద‌లైంది. నేనంటే.. నేనే.. అనే రేంజ్ ‌లో నాయ‌కులు కుస్తీ ప‌డుతున్నారు. నిజానికి [more]

Update: 2021-04-03 03:30 GMT

క‌ర్నూలు జిల్లా ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌మ్ముళ్ల మ‌ధ్య టికెట్ పోరు అప్పుడే మొద‌లైంది. నేనంటే.. నేనే.. అనే రేంజ్ ‌లో నాయ‌కులు కుస్తీ ప‌డుతున్నారు. నిజానికి ఈ వ‌ర్గపోరు.. ఇప్పటిది కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2009 నుంచి ఇక్కడ టీడీపీలో వ‌ర్గ పోరు కొన‌సాగుతూనే ఉంది. అప్పట్లో పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న వైకుంఠం మ‌ల్లికార్జున్ చౌద‌రి కుమారుడు వైకుంఠం ప్రసాద్ టికెట్ ఆశించారు. అయితే.. అప్పట్లో సీపీఐతో పొత్తు నేప‌థ్యంలో ఈ ట‌కెట్‌ను సీపీఐ నాయ‌కుడు కె. రామ‌కృష్ణకు కేటాయించారు. దీంతో త‌మ్ముళ్లు ఆయ‌న‌కు క‌లిసిరాలేదు. ఎవ‌రికివారుగా విడిపోయారు. దీంతో రామ‌కృష్ఖకు కేవ‌లం 27 వేల ఓట్లు మాత్రమే ప‌డ్డాయి.

కోట్ల కుటుంబం చేరికతో…..

ఇక‌, 2014 ఎన్నిక‌ల స‌మ‌యానికి వైకుంఠం సైలెంట్ అయిపోవ‌డంతో ఇక్కడి సీటును సీనియ‌ర్ నాయ‌కుడు బ‌స‌న్న గౌడకు మారుడు వీర‌భ‌ద్ర గౌడ‌కు కేటాయించారు. ఆ ఎన్నిక‌ల్లో వీర‌భ‌ద్ర గౌడ ప‌రాజయం పాల‌య్యారు. అప్పటి నుంచి పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి పెట్టారు. పార్టీ అధికారంలో ఉండ‌డంతో 2019 ఎన్నిక‌ల్లో త‌న‌దే టిక్కెట్ అన్న ధీమాతో ఆయ‌న ఉన్నారు. ఇక 2019 ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు దూర‌మైన‌.. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కోట్ల సుజాత‌మ్మ దంప‌తులు.. టీడీపీ పంచ‌న చేరారు. ఈ క్రమంలో సుజాత‌మ్మకు 2019 ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఆమెకు గెలుపు గుర్రం ఎక్కేందుకు అవ‌స‌రమైన అన్ని ఈక్వేష‌న్లు ఉన్నాయ‌ని.. భావించారు. పొరుగున ఉన్న డోన్‌, ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గాల‌తోపాటు.. ఇక్కడ కూడా ఆ ఫ్యామిలీకి ప‌ట్టు ఉంది.

తిరిగి యాక్టివ్ అయి….

అయితే.. అప్పటి వ‌ర‌కు పార్టీని నిల‌బెట్టిన త‌మ‌ను కాద‌ని.. సుజాతమ్మకు టికెట్ ఎలా ఇస్తారంటూ.. వీర‌భ‌ద్ర గౌడ వ‌ర్గం సుజాత‌మ్మకు స‌హ‌క‌రించ‌లేదు. దీంతో గుమ్మనూరు జ‌య‌రామ్ వ‌ర‌సగా రెండోసారి విజ‌యం సాధించారు. ఇక‌, ఇప్పుడు సుజాత‌మ్మ దంప‌తులు మరోసారి ఇక్కడ చ‌క్రం తిప్పుతార‌ని భావించి వీర‌భ‌ద్ర గౌడ‌.. వారికి ఛాన్స్ ఇవ్వకుండా ఉండేలా.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న ఆయ‌న త‌న వ‌ర్గం నేత‌ల‌తో యాక్టివ్ అవుతున్నారు. పార్టీ కార్యక్రమాలు సొంతంగా నిర్వ‌హిస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. అచ్చెన్నాయుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన క్రమంలో వీర‌భ‌ద్ర గౌడ‌.. హ‌డావుడి చేశారు. భారీ ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు. అయితే.. ఆ ఫ్లెక్సీల్లో కోట్ల కుటుంబం ఫొటోలు త‌ప్ప.. అంద‌రికీ ప్రాధాన్యం ఇచ్చారు. అంటే.. దీనిని బ‌ట్టి కోట్ల కుటుంబాన్ని వీర‌భ‌ద్ర గౌడ దూరం పెడుతున్నార‌నే సంకేతాలు ఇచ్చారు.

ఆయన దూకుడు పెంచడంతో….

అదేమంటే.. 'మీకు డోన్‌, ప‌త్తి కొండ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉన్నాయి… క‌నుక అక్కడ రాజ‌కీయం చేసుకోండి“ అనే సూచ‌న‌లు వీర‌భ‌ద్ర గౌడ వ‌ర్గం నుంచి వినిప‌స్తున్నాయి. ఇక బీసీ నినాదం ఎత్తుకుని పార్టీలో కొన్ని వ‌ర్గాల‌ను రెచ్చ గొడుతున్నారు. దీంతో సుజాత‌మ్మ ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డుతుందా ? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే.. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో సుజాత‌మ్మ త‌న వ‌ర్గాన్ని గెలిపించుకునేందుకు బాగానే క‌ష్టప‌డ్డారు. ఈ క్రమంలో అంద‌రినీ క‌లుపుకొని పోయారు. ఈ యాంగిల్‌లో చూసుకుంటే.. సుజాత‌మ్మ స‌క్సెస్ అయిన‌ట్టే క‌నిపిస్తున్నా.. వీర‌భ‌ద్రగౌడ దూకుడు పెంచ‌డంతో ఇక్కడి టీడీపీ రాజ‌కీయాలు ఎటు మ‌లుపుతిరుగుతాయోన‌ని ఆస‌క్తిగా మార‌డం విశేషం.

Tags:    

Similar News