ఇక ఫ్యూచర్ లేదట.. అందుకే త్వరలో నిర్ణయమట

ఒక్క అడుగు.. ఒకే ఒక్క అడుగు ఒక వ్యక్తిని నాయ‌కుడిని చేస్తుంది. అదే అడుగు నాయ‌కుడిని డ‌మ్మీని కూడా చేస్తుంది. ఇప్పుడు క‌ర్నూలు రాజ‌కీయాల్లో కూడా ఇలానే [more]

Update: 2020-05-09 00:30 GMT

ఒక్క అడుగు.. ఒకే ఒక్క అడుగు ఒక వ్యక్తిని నాయ‌కుడిని చేస్తుంది. అదే అడుగు నాయ‌కుడిని డ‌మ్మీని కూడా చేస్తుంది. ఇప్పుడు క‌ర్నూలు రాజ‌కీయాల్లో కూడా ఇలానే జ‌రిగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జిల్లాలోనే పేరును రాజ‌కీయ కుటుంబం కోట్ల. కోట్ల విజ‌య‌భాస్కర‌రెడ్డి కాంగ్రెస్‌లో కీల‌క నాయ‌కుడిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఆయ‌న త‌ర్వాత ఆయ‌న కుమారుడు, కేంద్రంలో మంత్రిగా కూడా చేసిన నాయ‌కుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి సుజాత‌మ్మ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. కాంగ్రెస్ హ‌యాంలో ఇద్దరూకూడా ఓ వెలుగు వెలిగారు. 2004 ఎన్నిక‌ల్లో కోట్ల క‌ర్నూలు ఎంపీగా గెలిస్తే.. ఆయ‌న స‌తీమ‌ణి సుజాత‌మ్మ డోన్ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నాయ‌కుడు, కేఈ కుటుంబంతో వారికి ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

రాష్ట్ర విభజనతో…..

అయితే, రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ అత‌లాకుత‌లం అయింది. అయినా కూడా కాంగ్రెస్‌నే ప‌ట్టుకుని వేలా డారు. కీల‌క స‌మ‌యంలో కీల‌క నాయ‌కులు త‌మ దారి తాము చూసుకున్నప్పుడు కూడా కోట్ల కుటుంబం కాంగ్రెస్‌తోనే ఉంది. అయితే, 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి మాత్రం మారి తీరాల‌ని నిర్ణయించుకుంది. అయితే, అప్పుడు వేసిన అడుగే ఇప్పుడు ఆ కుటుంబానికి శాపంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఎన్నిక‌ల ముందు వైసీపీ నేత‌ల నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఆహ్వానం అందింది. పార్టీలోకి రావాల‌ని స‌ముచిత ప్రాధాన్యం ఉంటుంద‌ని నేరుగా జ‌గ‌నే వారిని ఆహ్వానించిన‌ట్టు వార్తలు వ‌చ్చాయి.

వైఎస్ తో ఉన్న గ్యాప్ తోనే….

గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి కోట్ల విజ‌య భాస్కర రెడ్డికి ఉన్న గ్యాప్ సైతం కోట్ల ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లకపోవ‌డానికి ఓ కార‌ణమైంది. ఇక కోట్ల త‌న‌యుడు రాఘందేర్ రెడ్డికి లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యం సైతం ఈ ఫ్యామిలీ టీడీపీ వైపు చూసింది. చివ‌ర‌కు త‌ర్జన భ‌ర్జన‌ల త‌ర్వాత సీఎం చంద్రబాబు పిలుపుతో వారు వెనుక ముందుకూడా ఆలోచించ‌కుండానే టీడీపీ గూటికి చేరారు. వాస్తవానికి అప్పటికే బాబు మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తారా? అనే సందేహం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అయినా కూడా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం ఆయ‌న వెంట న‌డిచింది.

కీలకనేతలతా వైసీపీలోకి…..

ద‌శాబ్దాలుగా కేఈ కుటుంబంతో ఉన్న వైరాన్ని కూడా ప‌క్కన పెట్టి మ‌రీ ఎన్నిక‌ల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేసింది. ప్రచార స‌మ‌యంలోనే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి ఒక మాట అన్నారు. తాను పోటీ చేసే చివ‌రి ఎన్నిక‌లు ఇవేన‌ని త‌న‌ను గెలిపించాల‌ని ఆయ‌న ప్రజ‌ల‌ను వేడుకున్నారు. కాన, ప్రజ‌లు ఆయ‌న‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో అటు ఆయ‌న స‌తీమ‌ణితోపాటు ఆయ‌న కూడా ఓడిపోయారు. ఇక‌, ఇప్పుడు ఇద్దరూకూడా ప్రతిప క్షంలో ఉన్నారు. పోనీ.. టీడీపీ పుంజుకునే ప‌రిస్థితిలో ఉందా? అంటే .. రాష్ట్రంలో ఏమో చెప్పలేం కానీ, క‌ర్నూలు జిల్లాలో మాత్రం ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో ఇత‌ర నాయ‌కులు కూడా ఇప్పటికే వైసీపీలోకి జంప్ చేశారు.

వచ్చే ఎన్నికల నాటికి…..

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కోట్ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని ప‌రిస్థితి. పోనీ. వారసుడు సైతం యాక్టివ్ రాజ‌కీయాల్లో ఉండే ప‌రిస్థితి లేదు. దీంతో ఇక‌, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి రాజ‌కీయం దాదాపు రిటైర్మెంట్‌కు వ‌చ్చేసిన‌ట్టేన‌ని అంటున్నారు. అదే వారు వైసీపీలోకి వ‌చ్చి ఉంటే.. క‌నీసం నామినేటెడ్ ప‌ద‌వైనా ద‌క్కి ఉండేద‌ని, రాజ‌కీయంగా రిటైర్ అయ్యే ప‌రిస్థితిలో గౌర‌వ‌ప్రదంగా ఉండేద‌ని అంటున్నారు. మొత్తానికి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజ‌కీయ జీవితం చివ‌రి ద‌శ‌లో వేసిన రాంగ్ స్టెప్ ఆయ‌న రాజ‌కీయ జీవితాన్ని కాస్త త్వర‌గా ముగింపు చేసిన‌ట్లయ్యింది. త్వరలోనే కోట్ల తన నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న ప్రచారం మాత్రం జిల్లాలో బాగా వినపడుతుంది.

Tags:    

Similar News