కోట్ల ఆ నిర్ణయం తీసేసుకున్నారట

రాజకీయాలలో కుటుంబ ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. కొత్త జనరేషన్ రావడంతో పాతతరం నేతలు క్రమంగా గ్రిప్ కోల్పోతున్నారు. నేటి రాజకీయాలకు అనుగుణంగా నడవడం పాతతరం నేతలకు చేతకావడం [more]

Update: 2021-01-13 06:30 GMT

రాజకీయాలలో కుటుంబ ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. కొత్త జనరేషన్ రావడంతో పాతతరం నేతలు క్రమంగా గ్రిప్ కోల్పోతున్నారు. నేటి రాజకీయాలకు అనుగుణంగా నడవడం పాతతరం నేతలకు చేతకావడం లేదు. ఇందులో సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఒకరు. కోట్ల కుటుంబానికి కర్నూలు జిల్లాలో మంచి పేరుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేయడంతో ఆ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు లభించింది.

తొలి నుంచి కాంగ్రెస్ ను నమ్ముకుని….

కోట్ల కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ ను నమ్ముకుంది. కాంగ్రెస్ లోనే ఎదిగింది. ఎన్నో ఉన్నత పదవులను కాంగ్రెస్ పార్టీ ద్వారా దక్కించుకున్నారు. కానీ రాష్ట్ర విభజనతో అప్పటి వరకూ కాంగ్రెస్ లో ఉన్న కోట్ల కుటుంబం టీడీపీలో చేరాల్సి వచ్చింది. అప్పుడు అధికారంంలో ఉండటం, జగన్ పార్టీలో చేరడం ఇష్టం లేకపోవడంతో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి టీడీపీయే తమకు సరైన వేదిక అని భావించారు.

ఇద్దరూ ఓడిపోవడంతో….

కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో కోట్ల కుటుంబం ఓటమి పాలయింది. కర్నూలు ఎంపీగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన సతీమణి సుజాతమ్మ టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరి తప్పు చేశారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమయింది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని, టీజీ వెంకటేష్ ఈ మేరకు సంప్రతింపులు జరిపారన్న టాక్ కూడా నడిచింది.

తాను పార్టీని వీడేది లేదని…

అయితే ఇటీవల కాలంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. కరోనా కారణంగా ఆయన వయసు రీత్యా బయటకు రాలేదు. దీంతో ఈ ప్రచారం జరిగింది. కానీ తాను పార్టీ మారే ప్రసక్తి లేదని, టీడీపీలోనే కొనసాగుతానని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. మరో పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. ఇటీవల ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పలువురు కార్యకర్తలకు టీడీపీ కండువాలను కూడా కప్పేశారు. దీంతో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలోనే ఉంటారని, వచ్చే ఎన్నికల్లో తిరిగి కర్నూలు నుంచే బరిలోదిగుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Tags:    

Similar News