ఇమ్రాన్ కృష్ణ భజన ఎందుకంటే?
మన దాయాది దేశం పాకిస్ధాన్. అది పూర్తిగా మత ప్రాతిపదికగా ఏర్పడిన దేశం. ప్రభుత్వ అధికార మతం ఇస్లాం. అన్య మతాలకు, ఆ మత ప్రజల విశ్వాసాలకు, [more]
మన దాయాది దేశం పాకిస్ధాన్. అది పూర్తిగా మత ప్రాతిపదికగా ఏర్పడిన దేశం. ప్రభుత్వ అధికార మతం ఇస్లాం. అన్య మతాలకు, ఆ మత ప్రజల విశ్వాసాలకు, [more]
మన దాయాది దేశం పాకిస్ధాన్. అది పూర్తిగా మత ప్రాతిపదికగా ఏర్పడిన దేశం. ప్రభుత్వ అధికార మతం ఇస్లాం. అన్య మతాలకు, ఆ మత ప్రజల విశ్వాసాలకు, నమ్మకాలకు చోటు లేనేలేదు. మెజారిటీ ప్రజల మనోభావాలకు భిన్నంగా ముందుకు సాగే పరిస్ధితి మైనార్టీలకు లేదు. ఇటీవల కాలంలో కొద్దిపాటి మార్పులు వచ్చినట్లు కనపడినా దానిని తుంగలోకి తొక్కేందుకు ఛాందసవాద సంస్ధలు తెగబడుతున్నాయి. ప్రభుత్వం నిస్సహాయంగా చుాడటం తప్ప ఏమీ చేయలేక పోతోంది. తాజా సంఘటన ఇందుకు నిలువెత్తు నిదర్శనం.
హిందువుల కోసం…..
స్ధానిక హిందువుల వినతి మేరకు దేశ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం పదికోట్ల రూపాయల మంజుారుకు కాడా సుముఖత వ్యక్తం చేసింది. అంతేకాకుండా ముందస్తుగా పది లక్షలు విడుదల చేసింది. నగర నడిబొడ్డున గల హెక్టార్ -9 ప్రాంతపు ఆలయాల కోసం 20 వేల చదరపు అడుగుల స్ధలాన్ని కాపిటల్ డెవలప్ మెంట్ ఏరియాలో మంజుారు చేసింది. ఇస్లామాబాద్ లో దాదాపు ముాడువేలమంది హిందువులు నివసిస్తుంటారు. నగరంలో ఆలయ నిర్మాణ ప్రతిపాదన ఈనాటిదికాదు. 2016 లో స్ధానిక హిందూ పంచాయత్ అనే సంస్ధ ఆలయ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది. 2018 లోనూ మరోసారి ప్రయత్నం చేసింది. అధికార పార్టీ అయిన పాకిస్ధాన్ తెహ్రిక్ – ఇ – ఇన్సాఫ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు లాల్ చంద్ మల్లి ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. స్వయంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను కలసి ఆయనను ఒప్పించారు. ఈ మేరకు దేశ మత వ్యవహారాల మంత్రి పీర్ నూర్ షేక్ అన్ని అనుమతులు మంజుారు చేశారు. జూన్ 24న ఆలయ నిర్మాణానికి అంగరంగవైభవంగా శంకుస్ధాపన జరింగింది. పదిఅంతస్తుల్లో అధునాతన ఆలయాన్ని నిర్మించాలన్నది ఆలోచన. ఆలయంలో ఓ శ్మశానవాటిక కుాడా నిర్మించాలని ప్రతిపాదించారు. తొలుత స్ధానిక హిందువుల విరాళాలతో ఆలయానికి సంబంధించిన ప్రహరీగోడను నిర్మించారు. ఆ తరువాత మత ఛాందసవాద సంస్ధలు దానిని ధ్వంసం చేశాయి.
ఛాందస వాద సంస్థలు…
ఆలయ నిర్మాణాన్ని తాజాగా ఛాందసవాద సంస్ధలు వ్యతిరేకించడంతో ఆగిపోయింది. పాకిస్ధాన్ మత ప్రాతిపదిగా ఏర్పాటైన రాజ్యమని, అందువల్ల ఇక్కడ అన్యమతాలకు, వారి విశ్వాసాలకు చోటులేదని అవి వాదిస్తున్నాయి. ఈ మేరకు అవి ఇస్లామాబాద్, లాహోర్ హైకోర్టు ల్లో కేసుల దాఖలు చేశాయి. దేశరాజ్యాంగం మైనార్టీలకు కూడా చోటు కల్పిస్తుందని, వారి విశ్వాసాలను గౌరవిస్తుందని పేర్కొంటూ ఇస్లామాబాద్ హైకోర్టు వ్యాజ్యాన్ని కొట్టేసింది. లాహోర్ హైకోర్టు లో కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ఛాందసవాద సంస్ధలు తప్ప ప్రధాన పర్టీలైన పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ, నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్ధాన్ ముస్లింలీగ్, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్ధాన్ తెహ్రిక్ – ఇ – ఇన్సాఫ్ పార్టీ బహిరంగంగా వ్యతిరేకించడం లేదు. ప్రస్తుత విషయాలు ప్రభుత్వానికి చెందిన కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజి పరిశీలనలో ఉంది. మైనార్టీలకు చెందిన ఆలయాల పునర్ వ్యవస్ధీకరణ, వసతుల కోసం ప్రభుత్వం నిధులు మంజుారు చేస్తుందని, అంతే తప్ప ఆలయ నిర్మాణాల కోసం కాదని ఈ సంస్ధ చెబుతోంది. అడ్డంకులను అధిగమించి ఆలయ నిర్మాణాన్ని కొనసాగిస్తామని అధికార పార్టీకి చెందిన నేషనల్ అసెంబ్లి సభ్యుడు లాల్ చంద్ వల్లి చెబుతున్నారు. పాకిస్ధాన్ లో నేషనల్ అసెంబ్లీ మనదేశంలో లోక్ సభ వంటిది.
దేవాలయాలను మార్చి…..
ఇస్లామాబాద్ లో ఇంతకు ముందు రెండు హిందూ ఆలయాలు ఉండేవి. నగరంలోని సిధాపూర్ ప్రాంతంలో గల ఆలయాన్ని ప్రభుత్వం పర్యాటక స్ధలంగా మర్చింది. రావల్ ధామ్ ప్రాంతంలోని మరో ఆలయం వివాదంలో ఉంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో గల 428 ఆలయాలను ప్రభుత్వం పర్యాటక స్ధలాలుగా, హోటళ్ళుగా, షాపింగ్ మాళ్ళుగా మార్చింది. ఇది అత్యంత హేయనీయం. మైనార్టీల మనోభావాలను దారుణంగా దెబ్బతీయడమే అవుతుంది. పాకిస్ధాన్ పేరుకు మత రాజ్యమైనప్పటికీ అక్కడ మైనార్టీలు ఉన్నారు. పాకిస్ధాన్ హిందుా కౌన్సిల్ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 80 లక్షల మంది హిందువులు ఉన్నారు. అంటే దేశ జనాభాలో దాదాపు 4 శాతం. అధికారిక లెక్కల ప్రకారం 1.85 శాతం మంది హిదువులు, 1.59 శాతం మంది క్రిస్టియన్లు, 0.22 మంది అహ మ్మదియులు, 0.07 శాతం మంది ఇతరులు ఉన్నారు.
హిందువులు మైనారిటీలుగా…..
పాకిస్ధాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో హిందువులు ఎక్కువ. దీని రాజధాని కరాచీ దేశంలోనే అతిపెద్ద నగరం. అరేబియా సముద్రాన్ని ఆనుకునే ఉండే ఇక్కడ ఓడరేవు ఉంది. ఇక్కడ నివసించే సింధీలను హిందువులుగా పిలుస్తారు. మనదేశానికి చెందిన ఎల్.కె అద్వానీ, మాజీ ప్రధాని ఐ.కె గుజ్రాల్ సింధీ ముాలాలున్నవారే. పాకిస్ధాన్ లోని నాలుగు ప్రావిన్స్ ల్లో అత్యధికంగా సింధ్ లు 6.51 శాతం మంది హిందువులున్నట్లు అంచనా. బలూచిస్ధాన్ లో 0.49 శాతం పంజాబ్ లు 0.13 శాతం, ఖైబర్ ఫక్తూన్ క్వాలు 0.25 శాతం మంది హిందువులు ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖులు రాజ్ కపూర్, దేవానంద్, వినోద్ ఖన్నా, యశ్ చోప్రా, రమేష్ సిప్పి తదితరులు సైతం సింధీ మూలాలుగల వారే. పాక్ లోని హిందువులు ఆదేశ ప్రగతి లో భాగస్వాములు అవుతున్నారు. దేశం పట్ల వారి చిత్తశుద్ధి ప్రశ్నించలేనిది. ఈ నేపధ్యంలో ఛాందసవాద సంస్ధలు హిందువుల పట్ల తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం. ప్రభుత్వం కూడా వారి ఒత్తిడికి తలొగ్గ కుండా హిందువుల మనోభావాలు గౌరవించాలి. అప్పుడే అంతర్జాతీయంగా పాక్ ప్రతిష్ట పెరుగుతుంది.
-ఎడిటోరియల్ డెస్క్