కేటీఆర్ కు ఆ పదవి ఇప్పడు కాదట

తెలంగాణ ముఖ్యమంత్రి గా కేటీఆర్ ప్రమాణస్వీకారం చేస్తారని నిన్నటి వరకూ ప్రచారం జరిగింది. అయితే ఆ ఆలోచనకు కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో [more]

Update: 2021-05-29 09:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి గా కేటీఆర్ ప్రమాణస్వీకారం చేస్తారని నిన్నటి వరకూ ప్రచారం జరిగింది. అయితే ఆ ఆలోచనకు కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే కేటీఆర్ కు పట్టాభిషేకం చేయాలన్నది కేసీఆర్ ఆలోచన. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేటీఆర్ కు బాధ్యతలను అప్పగించడం వల్ల వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని కేసీఆర్ భావిస్తున్నారు. 2023 ఎన్నికలు పూర్తయిన తర్వాత అధికారంలోకి వస్తే కేటీఆర్ నే ముఖ్యమంత్రిని చేయాలన్నది ఆయన ఆలోచన.

ఈ ఏడాది ఇవ్వాలనుకున్నా……?

నిజానికి కేసీఆర్ ఈ ఏడాదే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని భావించారు. అయితే పరిస్థితులు సానుకూలంగా లేవు. ఎన్నికల్లో గెలుపోటముల సంగతి పక్కన పెట్టినా ఏడేళ్ల పాలనపై సహజంగా ప్రభుత్వంపై ఏర్పడే అసంతృప్తి కేటీఆర్ పై పడకూడదన్నది కేసీఆర్ భావన. వచ్చే ఎన్నికలను తన నాయకత్వంలోనే వెళితే హ్యాట్రిక్ విజయం ఖాయమని ఆయన నమ్ముతున్నారు. అందుకే కేటీఆర్ ముఖ్యమంత్రి అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీని గాడిన పెట్టి….

మరోవైపు అనేక నియోజకవర్గాల్లో పార్టీలో కూడా అసంతృప్తులు నెలకొన్నాయి. ఈ రెండేళ్లలో పార్టీని కూడా గాడిన పెట్టాలని యోచిస్తున్నారు. ప్రధానంగా సీనియర్ నేతలు ఉన్న చోట ఈ సమస్య ఎక్కువగా ఉండటంతో కేటీఆర్ వారిని డీల్ చేయలేరని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీలో అందరి నమ్మకాన్ని పొందేందుకే కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. కేటీఆర్ దానిని సమర్థవంతంగానే నిర్వహిస్తున్నారు.

వచ్చే ఎన్నికలకు ముందు….?

ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నా ఇది సమయం కాదని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు అయితే కొంత సాధ్యపడే అవకాశముంది. ఇప్పటికే మోదీ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా అసంతృప్తి పెరగడంతో వచ్చే ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లో దృష్టి పెట్టి రాష్ట్ర బాధ్యతను కేటీఆర్ కు అప్పగించాల్సి ఉంటుంది. సన్నిహితులు కూడా కేసీఆర్ కు ఇదే రకమైన సూచనలు చేయడంతో కేటీఆర్ ను ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారని చెబుతున్నారు.

Tags:    

Similar News