అందుకే తగ్గాడట.. లేకుంటే.. ఈపాటికి?
కుమారస్వామి తాను చెప్పింది చేయనున్నారా? గతంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తాను చేసిన వ్యాఖయలను కుమారస్వామి నిజం చేయనున్నారా? అంటే అవుననే అంటున్నారు. కర్ణాటకలో మరో [more]
కుమారస్వామి తాను చెప్పింది చేయనున్నారా? గతంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తాను చేసిన వ్యాఖయలను కుమారస్వామి నిజం చేయనున్నారా? అంటే అవుననే అంటున్నారు. కర్ణాటకలో మరో [more]
కుమారస్వామి తాను చెప్పింది చేయనున్నారా? గతంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తాను చేసిన వ్యాఖయలను కుమారస్వామి నిజం చేయనున్నారా? అంటే అవుననే అంటున్నారు. కర్ణాటకలో మరో ఉప ఎన్నిక జరగనుంది. తుముకూరు జిల్లా శిరా నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యనారాయణ మృతి చెందారు. శిరా స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. సత్యనారాయణ కుటుంబీకులకు ఇస్తారని ఒక ప్రచారం ఉంది.
నిఖిల్ ను బరిలోకి దింపి…..
కానీ కుమారస్వామి మాత్రం తన కుమారుడు నిఖిల్ ను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాండ్య పార్లమెంటు ఎన్నికల్లో నిఖిల్ ఓటమి పాలయినప్పటి నుంచి కుమారస్వామి శాసనసభ ఎన్నికల బరిలో దించాలని భావిస్తున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. ఇంకా ప్రభుత్వానికి రెండున్నరేళ్ల సమయం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ వేచి చూడాలన్నది దేవెగౌడ అభిప్రాయంగా ఉందని చెబుతున్నారు.
కుటుంబ పార్టీగా….
ఇప్పటికే జనతాదళ్ ఎస్ కుటుంబ పార్టీగా ముద్రపడింది. పోయిన ఎన్నికల్లోనూ కుమారస్వామి, ఆయన సతీమణి అనిత, సోదరుడు రేవణ్ణ పోటీ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో హాసన్ నియోజకవర్గం నుంచి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ పోటీ చేసి విజయం సాధించారు. తుముకూరు నుంచి దేవెగౌడ, మాండ్యా నుంచి కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు దేవెగౌడ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
పీకే సూచనతో…..
దీంతో నిఖిల్ విషయమే కుమారస్వామికి దిగులు పట్టుకుందట. అయితే నిఖిల్ ను శిరా నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయించాలా? వద్దా? అన్న విషయంపై ప్రశాంత్ కిషోర్ సలహా కూడా కుమారస్వామి తీసుకున్నారని చెబుతున్నారు. అయితే సాధారణ ఎన్నికల్లోనే పోటీ చేయించాలని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారని చెబుతున్నారు. అందుకే కుమారస్వామి కుమారుడు నిఖిల్ విషయంలో వెనక్కు తగ్గారంటున్నారు. దేవెగౌడ కూడా నిఖిల్ పోటీకి సుముఖంగా లేరని చెబుతున్నారు.