కటీఫ్ చెప్పేశారుగా…. ఇక చచ్చినా చేరేది లేదట

జేడీఎస్ అధినేత కుమారస్వామి కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగినట్లే కనపడుతుంది. వచ్చే ఎన్నికల్లోనూ జేడీఎస్ ఒంటరిపోరు చేయడానికే సిద్దమవుతుంది. గత కొంతకాలంగా కుమారస్వామి చేస్తున్న ఆరోపణలను, వ్యాఖ్యలను [more]

Update: 2020-10-10 18:29 GMT

జేడీఎస్ అధినేత కుమారస్వామి కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగినట్లే కనపడుతుంది. వచ్చే ఎన్నికల్లోనూ జేడీఎస్ ఒంటరిపోరు చేయడానికే సిద్దమవుతుంది. గత కొంతకాలంగా కుమారస్వామి చేస్తున్న ఆరోపణలను, వ్యాఖ్యలను పరిశీలిస్తే కాంగ్రెస్ కు ఆయన పూర్తిగా దూరమయినట్లేనని చెప్పక తప్పదు. తాజాగా శిర ఉప ఎన్నికల విషయంలోనూ కుమార స్వామి ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించడం విశేషం.

నమ్మకమైన పార్టీ కాదని….

కాంగ్రెస్ ను నమ్మకమైన పార్టీ కాదన్నది కుమారస్వామి అభిప్రాయం. దీనిని ఆయన కుండ బద్దలు కొట్టేశారు. కాంగ్రెస్ ను నమ్ముకున్న వారెవరూ బాగుపడలేదని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కంట్రోల్ లో పెట్టుకోక పోవడం వల్లనే ప్రభుత్వం కుప్పకూలిపోయిందని కూడా అన్నారు. అందుకే తాము శిర నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు కుమారస్వామి.

వచ్చే శాసనసభ ఎన్నికల్లో…..

ఈ ఉప ఎన్నికను పక్కన పెడితే మరో మూడేళ్లలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లేందుకు కుమారస్వామి నిర్ణయించుకున్నారు. మరోసారి కింగ్ మేకర్ కావాలన్నది కుమారస్వామి ఆలోచన. వచ్చే ఎన్నికల నాటికి యడ్యూరప్ప సీన్ లో ఉండరు కాబట్టి తనకు బీజేపీ మద్దతిస్తుందని కుమారస్వామి భావిస్తున్నారు. బీజేపీ అయితే ఎమ్మెల్యేలు కంట్రోల్ లో ఉంటారు. కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు భయపడరు.

బీజేపీయే బెటరని….

అందుకే కుమారస్వామి కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శిర ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కలసి పోటీ చేస్తాయని భావించాయి. కాంగ్రెస్ కూడా జేడీఎస్ తో సంప్రదింపులు జరిపింది. అయితే ఈ ప్రతిపాదనను కుమారస్వామి కొట్టిపారేశారు. శిరలో తాము బరిలో ఒంటరిగా దిగుతామని ప్రకటించారు. దీంతో భవిష్యత్తులో కాంగ్రెస్ కు దూరంగా ఉండాలన్నదే ఆయన ఫైనల్ నిర్ణయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News