లగడపాటి కుటుంబం వైసీపీలోకి… తెరచాటు మంతనాలు
విజయవాడ మాజీ ఎంపీ.. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల భవిష్యత్తు చెప్పే.. లగడపాటి రాజగోపాల్ కుటుంబం వైసీపీకి చేరువ అవుతోందన్న సంకేతాలు బయటకు వస్తున్నాయి. దివంగత మాజీ [more]
విజయవాడ మాజీ ఎంపీ.. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల భవిష్యత్తు చెప్పే.. లగడపాటి రాజగోపాల్ కుటుంబం వైసీపీకి చేరువ అవుతోందన్న సంకేతాలు బయటకు వస్తున్నాయి. దివంగత మాజీ [more]
విజయవాడ మాజీ ఎంపీ.. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల భవిష్యత్తు చెప్పే.. లగడపాటి రాజగోపాల్ కుటుంబం వైసీపీకి చేరువ అవుతోందన్న సంకేతాలు బయటకు వస్తున్నాయి. దివంగత మాజీ ఎంపీ పర్వతనేని ఉపేంద్ర అల్లుడుగా రాజకీయ అరంగేట్రం చేసిన లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఉద్యమ సమయంలో తనదైన వైఖరితో రాజకీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే ద్వారా.. జాతీయంగా విమర్శలు కూడా మూటగట్టుకున్నారు. ఆంధ్రా ఆక్టోపస్‌గా ఆయన ఎన్నికల ఫలితాల అంచనాలో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. గత ఏడాది ఏపీలో మళ్లీ చంద్రబాబు పాలనే వస్తోందని చెబుతూ ఫలితాల సరళిలోనూ ఆయన విఫలమయ్యారు. అంతకు ముందు తెలంగాణ సాధారణ ఎన్నికల్లోనూ మహాకూటమి గెలుస్తుందని చెప్పి బెట్టింగ్ రాయుళ్లను నిండా ముంచేశారు. ఈ రెండు అంచనాలు తప్పడంతో ఆయన సైలెంట్ అయిపోయారు.
కుమారుడి కోసం….
అప్పటినుంచి లగడపాటి రాజగోపాల్ రాజకీయంగా దూరమైనా.. ఆయన తన కుమారుడు ఆశ్రిత్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని లగడపాటి రాజగోపాల్ ప్రయత్నిస్తున్నారు. కొన్ని రోజుల కిందట పెద్ద ఎత్తున విజయవాడలో బ్యానర్లు కూడా వెలిసాయి. అయితే.. అప్పట్లో ఇదే అభిమానులు మాత్రమే చేశారని.. తనకు సంబంధం లేదని పేర్కొన్న లడగపాటి ఇప్పుడు మాత్రం వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. త్వరలోనే వైసీపీలోకి తన కుమారుడిని పంపించి.. రాజకీయంగా వేదిక కల్పించేందుకు సిద్ధమవుతున్నారని హైదరాబాద్ వర్గాలు చెబుతున్నాయి.
వ్యాపారాలకే పరిమితమై….
అయితే.. కమ్మ వర్గానికి చెందిన లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ నుంచి వరుసగా రెండు సార్లు విజయవాడ ఎంపీగా గెలిచినా రాష్ట్ర విభజన తర్వాత మాత్రం టీడీపీకి సానుకూలంగా వ్యవహరించారు. చంద్రబాబు వైఖరిని సమర్ధించారు. గత ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు ప్రభుత్వమే మళ్లీ కొలువుదీరుతుందని.. పసుపు-కుంకుమ ప్రభావం భారీ ఎత్తున ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే.. ఆ ప్రిడక్షన్ ఫెయిలైంది. ఆ తర్వాత లగడపాటి రాజగోపాల్ కు చంద్రబాబుకు మధ్య గ్యాప్ పెరిగి.. కేవలం వ్యాపారాల వైపే ఉంటున్నారు.
బెజవాడ పార్లమెంటుకు….
ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి బాగోలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ అయితే బెటర్ అని లగడపాటి రాజగోపాల్ భావిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల ఫలితాల్లో వరుసగా తన అంచనాలు తప్పుతుండడంతో ఈసారి మాత్రం తన కుమారుడికి సరైన రాజకీయ వేదిక కల్పించే విషయంలో రాంగ్ స్టెప్ వేయకూడదని ప్లానింగ్‌తోనే ముందుకు వెళుతున్నారట. వైసీపీలోని పలువురు కీలక నేతలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్లతో ఇప్పటికే ఆయన మంతనాలు షురూ కూడా చేస్తున్నారని తెలుస్తోంది. విజయవాడ పార్లమెంటు స్థానానికి వైసీపీ సరైన వ్యక్తి కోసం అన్వేషిస్తోంది. లగడపాటి రాజగోపాల్ కన్ను కూడా దీనిపైనే ఉందంటున్నారు. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్‌తో వియ్యం పొందిన లగడపాటి రాజగోపాల్ అక్కడా.. ఇక్కడా తన వ్యాపారాలకు ఇబ్బంది లేని రాజకీయం నడుపుకుంటూ వస్తున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే టీడీపీ భవిష్యత్ ఆయన అంచనా వేసే.. తన వారసుడు వైసీపీలో చేరేలా మార్గం రెడీ చేస్తున్నారని అంటున్నారు.