విలువ లేకుండా పోయిందా?

ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాలకు మరోదారి కన్పించడం లేదు. ఇప్పటి వరకూ ఏదో ఒక పార్టీని నమ్ముకుని వెళదామనుకుంటున్న కామ్రేడ్లకు చంద్రబాబు నిర్ణయంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు [more]

Update: 2021-06-13 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాలకు మరోదారి కన్పించడం లేదు. ఇప్పటి వరకూ ఏదో ఒక పార్టీని నమ్ముకుని వెళదామనుకుంటున్న కామ్రేడ్లకు చంద్రబాబు నిర్ణయంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ఇచ్చిన ప్రకటన వామపక్షాలను ఇరకాటంలోకి నెట్టిందనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తో కలసి వెళదామనుకుంటున్న వామపక్షాలకు ఆయన నిర్ణయం పునరాలోచనలో పడేలా చేసింది.

పదేళ్ల నుంచి….?

ఆంధప్రదేశ్ లో వామపక్షాలకు ప్రస్తుతం బలం లేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వామపక్షాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలో తమకు పట్టున్న ప్రాంతాల్లో సయితం వారికి గత ఎన్నికల్లో చుక్కెదురయింది. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి వామపక్షాలు నడిచాయి. అయతే ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయాయి. దీనికి తోడు పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో వామపక్షాలు జనసేనకు దూరం జరిగాయి.

బాబుకు మద్దతుగా…?

అదే సమయంలో ఓటమి భారంతో కుంగిపోయి ఉన్న చంద్రబాబుకు వామపక్షాలు అండగా నిలిచాయి. ప్రధానంగా సీపీఐ చంద్రబాబుకు అనేక అంశాల్లో బాసటగా నిలిచింది. రాజధాని అమరావతి అంశం మొదలుకొని టీడీపీ నేతల అరెస్ట్ ల వరకూ సీపీఐ వెన్నుదన్నుగా నిలిచింది. అధికార వైసీపీ వైఖరి పట్ల వామపక్షాలు నిరసనలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలసి వెళ్లాలన్న ఆలోచనతోనే వామపక్షాలు చంద్రబాబుకు అండగా నిలిచారు.

ఇక ఒంటరిపోరేనా?

అయితే ఇటీవల చంద్రబాబు మహానాడు సందర్భంగా తీసుకున్న నిర్ణయం వామపక్షాలను ఇబ్బందులకు గురి చేసింది. బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించడాన్ని వామక్షాలు తప్పుపడుతున్నాయి. బీజేపీకి తొత్తుగా చంద్రబాబు మారారని వామపక్ష పార్టీల నేతలు విమర్శలు మొదలు పెట్టారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఇటు చంద్రబాబుతో వెళ్లలేక, అటు పవన్ తో కలవలేక వామపక్షాలు ఒంటరి పోరు చేయాల్సి వస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద ఏపీలో వామపక్ష పార్టీలకు విలువ లేకుండా పోయింది. ఓటు బ్యాంకు లేకపోవడంతో వాటిని ఏ పార్టీ కూడా ఖాతరు చేసే పరిస్థితి లేదు.

Tags:    

Similar News