బరులు రెడీ…?

స్థానిక స‌మ‌రానికి త్వర‌లోనే ఏపీలో బ‌రులు (పంచాయతీలు) సిద్ధమ‌వుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో త్వర‌లోనే నోటిఫ‌కేష‌న్ కూడా వెలువ‌డ‌నుంది. అయితే, ఈ ఎన్నిక‌లు చాలా ప్రత్యేకం గురూ అంటున్నా [more]

Update: 2020-02-23 12:30 GMT

స్థానిక స‌మ‌రానికి త్వర‌లోనే ఏపీలో బ‌రులు (పంచాయతీలు) సిద్ధమ‌వుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో త్వర‌లోనే నోటిఫ‌కేష‌న్ కూడా వెలువ‌డ‌నుంది. అయితే, ఈ ఎన్నిక‌లు చాలా ప్రత్యేకం గురూ అంటున్నా రు ప‌రిశీల‌కులు. ఎలాగంటే.. ఒక‌వైపు జ‌గ‌న్ ప్రభుత్వం అభివృద్ది నినాదాన్ని భుజానికి ఎత్తుకోవ‌డం, మ‌రోవైపు సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్రబాబు ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను నెత్తికెత్తుకునేందుకు ప్రయ‌త్నించడం.

పార్టీల కన్నా….

మ‌రి ఈ క్రమంలో ప్రజ‌ల్లో ఉన్న ఊహాగానాలు ఏమిటి? ఎవ‌రు ఎటువైపు మొగ్గుతారు? ఇటీవ‌ల వ‌చ్చిన ఢిల్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను స‌రిపోల్చుకుంటున్న అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీలు ఎలాంటి వ్యూహాల‌తో స్థానికంగా దూకుడు చూపిస్తాయి ? అనే చ‌ర్చ జోరుగా సోగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా అక్కడ ఉన్న సమస్యలను ఆధారంగానే జరుగుతాయి. ఇక్కడ పార్టీలకన్నా అభ్యర్థులే ఓటర్లకు ముఖ్యమనిపిస్తారు.

అభివృద్ధి మంత్రంతో…

ప్రస్తుతం ప్రభుత్వం స్థానిక ఎన్నిక‌ల‌పై సంపూర్ణ దృష్టిని మ‌ర‌ల్చింది. ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్ విష‌యాన్ని ఇప్పటికే స్ప‌ష్టం చేసిన ప్ర‌భుత్వం దీనిపై ప్రస్తుతం హైకోర్టులో దాఖ‌లైన కేసులు, వాటి విచార‌ణ నేపథ్యంలో తీర్పు కోసం ఎదురు చూస్తోంది. ఈ తీర్పు వ‌చ్చిన వెంట‌నే స్థానిక ఎన్నిక‌లకు రంగం సిద్ధం చేసుకుని కేవ‌లం 15 రోజుల్లోనే క్రతువును పూర్తి చేసేందుకు సీఎం జ‌గ‌న్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా రు. ఇక‌, సాధార‌ణంగా ఎన్నిక‌లు అన‌గానే ప్రజ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు పార్టీలు, అభ్యర్థులు ప్ర యత్నిస్తాయి. ఈ క్రమంలో జ‌గ‌న్ అభివృద్ధి మంత్రాన్నే జ‌పించాల‌ని నిర్ణయించుకున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలతో…..

మ‌నం అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాం. పింఛ‌ను పెంచాం. ఇళ్లు ఇస్తున్నాం.. అనేక రూపాల్లో ప్రజ‌ల కు ఆర్థికంగా భ‌రోసా ఇస్తున్నాం.. ఇంత చేస్తున్నప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంచ‌డం ఎందుకు? అనేది కీల‌కంగా మారిన సీఎం జ‌గ‌న్ ప్రశ్న. సో.. దీనిని బ‌ట్టి ప్రభుత్వ వ‌ర్గాలు అన్నీ కూడా ఎన్నిక‌ల్లో అభివృద్ధి మంత్రాన్నే జ‌పించ‌నున్నాయ‌నేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక‌, విప‌క్షం విష‌యానికి వ‌స్తే.. ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను అడ్డు పెట్టుకుని ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని నిర్ణయించుకుంది. ఈ నేప‌థ్యంలో ప్రజా చైత‌న్య యాత్రల‌ను చంద్రబాబు ప్రారంభించ‌నున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో వ‌చ్చిన ఫ‌లితం మాదిరిగా ప్రజ‌లు అభివృద్ధికి పెద్దపీట వేస్తారా? లేదా? అనే సందేహం రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News