అన్ని పార్టీల ఖజానా ఖాళీ కానుందా?
ఎన్నికల వాయిదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు ఈ నెలాఖరుకు పూర్తి అయితే ఏపీ ప్రభుత్వానికి దాదాపు ఐదు వేలకోట్ల [more]
ఎన్నికల వాయిదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు ఈ నెలాఖరుకు పూర్తి అయితే ఏపీ ప్రభుత్వానికి దాదాపు ఐదు వేలకోట్ల [more]
ఎన్నికల వాయిదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు ఈ నెలాఖరుకు పూర్తి అయితే ఏపీ ప్రభుత్వానికి దాదాపు ఐదు వేలకోట్ల రూపాయలు కేంద్రం 14 ఆర్ధిక సంఘం నుంచి ఇవ్వలిసినవి ఇచ్చేది. అసలే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ఏపీ కి ఈ నిధులు అత్యంత అవసరం. అయితే ఇప్పుడు ఎన్నికల సంఘం బ్రేక్ కొట్టింది కరోనా ఎఫెక్ట్ తో. దాంతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఎపి సర్కార్ పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారపార్టీ సుప్రీం కోర్టు తలుపు తట్టాలని చూస్తూ ఉండటంతో ఎన్నికల ఫీవర్ అలాగే ఉండనుంది.
అన్ని రోజులు భరించక తప్పదా …?
ఎన్నికలు అంటే అత్యంత ఖర్చుతో కూడినవి. అలాంటిది నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యి ప్రచార దశలో బ్రేక్ వస్తే కొన్ని వారాలపాటు అటు క్యాడర్ ను ఇటు ప్రజలను ప్రసన్నం చేసుకోవడం అభ్యర్థులకు కత్తిమీద సామే. అన్ని రోజులు ప్రచారం నిర్వహించే వారు ఆస్తులు అమ్ముకోవాలిసిందే. అందుకే సర్కార్ సైతం అత్యంత తక్కువ కాలంలో ఎన్నికల ప్రచారానికి సమయం ఇచ్చి అభ్యర్థుల నెత్తిన పాలు పోసింది.
వాయిదా పడటటంతో…
అయితే కరోనా పేరు చెప్పి ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడ్డాయి. దాంతో దెబ్బకు అభ్యర్థులు అబ్బా అంటున్నారు. ఇన్ని రోజుల పాటు భారం మోయడమే ఇప్పుడు ఏ పార్టీ కైనా అసలు సవాల్. ప్రచారం చేయడం, క్యాడర్ ను మేపడం వంటివి ఆర్థికంగా అభ్యర్థులకు ఇబ్బందులతో కూడుకున్నదే. రోజుకు కనీసం ఒక కార్పొరేటర్ అభ్యర్థికి రెండు లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఆరు వారాలు ఈఖర్చును భరించలేక అభ్యర్థులు చేతులెత్తే అవకాశముంది. దీన్ని ప్రధాన పార్టీలు ముఖ్యంగా విపక్ష పార్టీలు ఎలా ఎదుర్కొంటాయి అన్నది చూడాలి.