కమల్ నాధ్ ఆశలు గల్లంతేనా?

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు జరిగాయి. ఫలితాలు తేేలాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికలు ప్రభుత్వ మనుగడను నిర్దేశిస్తాయి. మధ్యప్రదేశ్ లో మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప [more]

Update: 2020-11-08 18:29 GMT

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు జరిగాయి. ఫలితాలు తేేలాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికలు ప్రభుత్వ మనుగడను నిర్దేశిస్తాయి. మధ్యప్రదేశ్ లో మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ సాధిస్తే తిరిగి అధికారంలోకి వచ్చే వీలుంది. అదే బీజేపీ తన పట్టును నిలుపుకోగలిగితే అధికారాన్ని కాపాడుకోగలగుతుంది. మరి కొద్ది గంటల్లో శివరాజ్ సింగ్ చౌహన్ భవితవ్యం తేలనుంది.

28 స్థానాలకు ఉప ఎన్నికలు….

మధ్యప్రదేశ్ లో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరందరూ బీజేపీ వైపు మొగ్గు చూపడంతో కమల్ నాధ్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో వీరందరూ బీజేపీలో చేరడంతో తిరిగి వారికే టిక్కెట్లను బీజేపీ కేటాయించింది. ప్రజా తీర్పు ను బీజేపీ కోరనుంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కొంత వారిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

వారిపై వ్యతిరేకత…..

కమల్ నాధ్ ఆశలన్నీ ప్రజల నుంచి వారిపై వ్యతిరేకత కన్పిస్తుండటమే. కనీసం 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇరవై ఎనిమిది స్థానాలను సాధించగలిగితే కమల్ నాధ్ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది మెజారిటీకి ఒక్క స్థానం తగ్గినా స్వతంత్ర ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థులకు అక్కడక్కడ ప్రజా వ్యతిరేకత కన్పించడం కమల్ నాధ్ కు కొంత ఊరట కల్గించే అంశం. అందుకే ఆయన ఉప ఎన్నికలపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కానీ మొత్తం స్థానాలను గెలుచుకోవడం కష్టమే.

సింధియాకు సవాల్….

మరో వైపు మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు జ్యోతిరాదిత్య సింధియాకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆయన తన ప్రచారంలో తాను ఎందుకు కాంగ్రెస్ ను వీడాల్సి వచ్చిందీ స్పష్టంగా చెప్పారు. మరోసారి తమ అభ్యర్థులను ఆదరించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే బీజేపీలో జ్యోతిరాదిత్య సింధియా భవిష్యత్ ఆధారపడి ఉంది. మొత్తం మీద మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు ముగ్గురు నేతల రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ఫలితాలు గంటల్లో తేలనుంది.

Tags:    

Similar News