నాతో పెట్టుకోకు

కర్నాటకం ముగిసింది. కమలం జండా అనుకున్నట్లే ఎగురవేశారు. కాషాయ జండా నెక్స్ట్ టార్గెట్ మధ్యప్రదేశ్ అని తేలిపోతుంది. అయితే ఇది మాత్రం అంత ఈజీ కాదన్నది విశ్లేషకుల [more]

Update: 2019-07-29 18:29 GMT

కర్నాటకం ముగిసింది. కమలం జండా అనుకున్నట్లే ఎగురవేశారు. కాషాయ జండా నెక్స్ట్ టార్గెట్ మధ్యప్రదేశ్ అని తేలిపోతుంది. అయితే ఇది మాత్రం అంత ఈజీ కాదన్నది విశ్లేషకుల అంచనా. ఇప్పటికే మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ రివర్స్ వ్యూహంతో బిజెపి ఎమ్యెల్యేలనే మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఇక్కడ ఆపరేషన్ ఎలా చేసి విజయవంతం కావాలా అన్నదే కమలం ప్రస్తుత కసరత్తు.

రెండు పార్టీలు నువ్వా నేనా …

మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలకు గాను 116 స్థానాల మ్యాజిక్ ఫిగర్ అధికారం కట్టబెడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ 114 స్థానాల్లో విజయం సాధించినా రెండు సీట్ల దూరంలో అధికారం హస్తగతం చేసుకోవడానికి మిత్రులపై ఆధారపడాలిసి వచ్చింది. బీఎస్పీ ఇద్దరు, ఇతరులు ఐదుగురు ఎన్నికయ్యారు. వీరందరిని కలుపుకుని హస్తం పార్టీ పాలన చేపట్టింది. అయితే 109 స్థానాల్లో వున్న బిజెపికి మరో ఏడుగురు శాసనసభ్యులు ఉంటే అధికారం దక్కుతుంది. కర్ణాటకలో 14 నెలలపాటు చేసిన ఆపరేషన్ విజయవంతం కావడంతో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ను సాగనంపి పవర్ లోకి రావాలన్న రాజకీయాన్ని చాపకింద నీరులా అమలు చేయాలని హస్తిన పెద్దలు కన్నేశారు.

అప్రమత్తం అయిన కమలనాధ్ …

దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వుంటూ రాజకీయాల్లో డక్కామొక్కీలు తిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ అంత ఈజీగా తన కుర్చీని ప్రత్యర్థులకు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో సమయం కోసం వేచి చూస్తుంది బిజెపి. తమ సర్కార్ పై కాషాయ పార్టీ కన్నేసి ఉంటుందన్న ఆందోళనతో కమల్ నాధ్ బిజెపి లోని ఎమ్యెల్యేలనే తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ లో కానీ తనకు మద్దతు ఇచ్చే మిత్రుల్లో కొందరిని బిజెపి టార్గెట్ చేసినా ప్రత్యర్థి పార్టీలో తన అనుకూలురును తయారు చేసుకోవడంతో సమయం వచ్చినప్పుడు వారి సాయంతో బయటపడాలన్న వ్యూహంతో కమల్ నాధ్ సాగుతున్నట్లు ప్రచారం నడుస్తుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల బిల్లుకు సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు ఇద్దరు బిజెపి సభ్యులు బాహాటంగానే మద్దతు పలికి పరోక్షంగా హైకమాండ్ కు హెచ్చరికలు పంపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో మరో కొత్త వ్యూహంతో ఇక్కడ కాంగ్రెస్ పవర్ ను వీక్ చేసే అజెండా పై షా బృందం కసరత్తు ముమ్మరం చేసినట్లు హస్తిన వర్గాల్లో టాక్. మరి భవిష్యత్తులో ఏమి జరగనుందో చూడాలి.

Tags:    

Similar News