రాజమండ్రిని కన్నెత్తి చూడరట … ?

మాగంటి మురళి మోహన్ నటుడు, నిర్మాత టాలీవుడ్ పెద్ద, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కూడా. ఇలా బహుముఖాలుగా రాణించిన మురళి మోహన్ తెలుగుదేశం పార్టీలో గతంలో చాలా [more]

Update: 2021-08-27 05:00 GMT

మాగంటి మురళి మోహన్ నటుడు, నిర్మాత టాలీవుడ్ పెద్ద, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కూడా. ఇలా బహుముఖాలుగా రాణించిన మురళి మోహన్ తెలుగుదేశం పార్టీలో గతంలో చాలా చురుగ్గా ఉండేవారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు 2009, 2014 పార్లమెంట్ ఎన్నికల టికెట్ ను చంద్రబాబు పిలిచి మరీ ఇచ్చారు. 2019 లో ఆయన కోడలు మాగంటి రూపకి టికెట్ ఇచ్చి మురళి మోహన్ రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఆయన కుటుంబాన్ని పార్టీ ప్రోత్సహిస్తుందనే సంకేతాలు ఇచ్చారు బాబు.

రాజకీయాలకు గుడ్ బై …?

అయితే మూడు సార్లు రాజమండ్రి పార్లమెంట్ టికెట్ దక్కించుకుని ఒకసారి గెలిచి రెండు సార్లు ఓటమి పాలైన మురళి మోహన్ కుటుంబం ఇకపై రాజకీయాలకు గుడ్ బై కొట్టేయాలనే నిర్ణయం తీసుకోవడం చర్చనీయంగా మారింది. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసినప్పుడు మురళి మోహన్ ఓటమి పాలయ్యారు. సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ కుమార్ చేతిలో పరాజయం పొందారు. హీరో కృష్ణం రాజు సైతం ఉండవల్లి చేతిలో ఆ ఎన్నికల్లో చతికిల పడి క్రీయాశీలక రాజకీయాల్లో లేకుండా పోయారు. ఆ ఓటమి తరువాత మురళి మోహన్ తరువాతి ఎన్నికల్లో గెలవడానికి ఐదేళ్ళు రాజమండ్రిని అంటిపెట్టుకుని ప్రజలకు దగ్గర అయ్యారు. క్యాడర్ తో బాగా టచ్ లో ఉండేవారు. తాను స్థానికంగానే ఉంటానని హైదరాబాద్ లో ఉండనని ప్రజలను నమ్మించేందుకు స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించారు మురళి మోహన్.

ఇష్టపడిన ఇల్లు అమ్మేశారు …

అయితే గత ఎన్నికల్లో ఆయన కోడలు రూప వైసిపి అభ్యర్థి మార్గాని భరత్ రామ్ పై ఘోరంగా ఓటమి పాలయ్యారు.కట్ చేస్తే ఆ తరువాత ఆయన రాజమండ్రి రావడమే మానేశారు. గత ఎన్నికల్లో ఆర్ధికంగా గట్టి దెబ్బ తగలడం అమరావతిలో భూముల లావాదేవీలు వ్యాపారాలపై జగన్ సర్కార్ మోపిన ఉక్కుపాదంతో మురళి మోహన్ కి గట్టి దెబ్బలే తగిలినట్లు తెలుస్తుంది. దాంతో కొంతకాలం ఆగి ఎంతో ఇష్టంగా కట్టుకున్న రాజమండ్రిలోని బిల్డింగ్ ను అమ్మేసి దుకాణం పూర్తిగా బంద్ చేసేసారు మురళి మోహన్. ఈ పరిణామం టిడిపి లో పెద్ద చర్చకు తెరతీసింది. నాన్ లోకల్ వ్యక్తులకు చంద్రబాబు టికెట్లు ఇవ్వడం అందులోను పార్లమెంట్ స్థానం ఎప్పుడు తన సామాజిక వర్గం వారికి, ఆర్ధిక పరిపుష్టి ఉన్న వారికి ఇవ్వడం వల్లే పార్టీకి పరాభవాలు తరచూ పలకరిస్తున్నాయని పార్టీ వర్గాలు వాపోతున్నాయి.పదవులు వచ్చినా లేకపోయినా పార్టీ కోసం రక్తం చిందించే వారిని పక్కన పెడితే మాగంటి మురళీమోహన్ తీరులాగే ఉంటుందన్న విమర్శలు ఇటీవల బాగా పెరిగాయి.

Tags:    

Similar News