టీడీపీకి చేరువ‌వుతున్న వైసీపీ ఎంపీ.. రీజ‌నేంటి..?

ఆయ‌న వైసీపీ ఎంపీ.. పార్టీలోని ఇత‌ర నేత‌ల విష‌యం ఏమోకానీ, ముఖ్యమంత్రి జ‌గ‌న్ వ‌ద్ద మంచి పేరు, ఇమేజ్ కూడా ఉంది. అదే స‌మయంలో ప్రజ‌ల్లో మంచి [more]

Update: 2021-08-06 05:00 GMT

ఆయ‌న వైసీపీ ఎంపీ.. పార్టీలోని ఇత‌ర నేత‌ల విష‌యం ఏమోకానీ, ముఖ్యమంత్రి జ‌గ‌న్ వ‌ద్ద మంచి పేరు, ఇమేజ్ కూడా ఉంది. అదే స‌మయంలో ప్రజ‌ల్లో మంచి సానుభూతి ఉంది. అయితే.. ఇప్పుడు ఆయ‌న చేస్తున్న వ్యవ‌హారాలు.. ఇటు పార్టీలోనూ.. అటు ప్రజ‌ల్లోనూ చర్చకు, ర‌చ్చకు దారితీశాయి. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన నాయ‌కుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. పార్టీలోకి రావ‌డంతోనే… ఒంగోలు వైసీపీ టికెట్‌ను సంపాయించుకుని పోటీ చేసిన జ‌గ‌న్ సునామీలో విజయం ద‌క్కించుకున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నప్పటికీ.. ఆ త‌ర్వాత‌.. జిల్లా పార్టీలో చెల‌రేగిన‌.. అసంతృప్తులు.. నేత‌ల మ‌ధ్య దూరం వంటివి.. మాగుంట‌ను సైలెంట్ చేశాయి.

తన పని తాను చేసుకుపోతున్నా…?

అయిన‌ప్పటికీ.. వైసీపీలోని కొంద‌రు ఆధిప‌త్య ధోర‌ణిని ప్రద‌ర్శించిన‌ప్పటికీ.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాత్రం త‌న ప‌నితాను చేసుకుని పోయేవారు. కుదిరితే త‌న వ‌ర్గానికి ప‌నులు చేసేవారు. లేదంటే.. మౌనంగానే వ్యవ‌హ‌రించారు. అయితే.. మాగుంట చారిటీస్ త‌ర‌ఫున ప్రజ‌లకు ఏదో ఒక రూపంలో సేవ చేయ‌డం మాత్రం మ‌రిచిపోలేదు. ఇదిలావుంటే.. తాజాగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి వ్యవ‌హారం.. పార్టీలో చర్చకు దారితీసింది. మాగుంట‌ను వ్యతిరేకిం చే ఓ వ‌ర్గం… కొన్నాళ్లుగా.. ఆయ‌న త‌న పాత పార్టీ.. టీడీపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని, వారి వాట్సాప్ గ్రూపుల్లోనూ మాగుంట‌కు ప్రాధాన్యం ఉంద‌నే విమ‌ర్శలు చేస్తున్నారు.

మాగుంట విందుకు…?

అయితే.. ఈ విష‌యాన్ని ఎవ‌రూ సీరియ‌స్‌గా తీసుకోలేదు. కానీ, తాజాగా జ‌రుగుతున్న పార్లమెంటు స‌మావేశాల స‌మ‌యంలో.. ఢిల్లీలోని త‌న నివాసంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీల‌కు విందు ఏర్పాటు చేశార‌ట‌. అయితే.. సాధార‌ణంగా. ఇలాంటివి జ‌రుగుతూనే ఉంటాయి కాబ‌ట్టి.. దీనిపై చ‌ర్చ ఎందుకు? అనే ప్రశ్న వ‌స్తుంది. కానీ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన పార్టీకి టీడీపీ ఎంపీలు హాజ‌ర‌య్యార‌ట‌. దీంతో ఈ విష‌యాన్ని వైసీపీ ఎంపీలు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. “ఇప్పటి వ‌ర‌కు ఆయ‌న‌పై ఎన్నో విమర్శలు వ‌చ్చాయి. ఇప్పుడు క‌ళ్లతో చూశాం. అయినా.. టీడీపీ ఎంపీల‌ను పార్టీకి పిలిచిన‌ప్పుడు.. మ‌మ్మల్ని ఎందుకు పిల‌వాలి? ఇది చాలా సీరియ‌స్ ఇష్యూ“ అని ఒక సీనియర్ వైసీపీ ఎంపీ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

వ్యాపారాల వల్లనే…

అయితే జిల్లాకే చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి తీవ్రమైన విబేధాలు ఉండ‌డం, ఇటీవ‌ల ఏపీలో కాకుండా చెన్నైలో త‌న కొత్త వ్యాపార కార్యక‌లాపాలు విస్తరించ‌డం లాంటివి అధిష్టానంతో ఆయ‌న‌కు గ్యాప్ పెంచాయంటున్నారు. పైగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవ‌ల తమిళ‌నాడు సీఎం స్టాలిన్‌తో పాటు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. ఇక ఇప్పుడు మాగుంట త‌న వ్యాపారం కోసం ఏపీలో త‌మ పార్టీని న‌మ్మడం కంటే ఎక్కడ ఎవ‌రితో అయినా స‌న్నిహితంగా ఉండాల‌న్న నిబంధ‌న‌తోనే ముందుకు వెళుతున్నార‌ని టాక్ ? ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీని వీడ‌డం ఇష్టం లేక‌పోయినా వైసీపీ వాళ్లు అనేక హామీలు ఇచ్చి మ‌రీ ఇటు వైపున‌కు తిప్పుకున్నార‌ట‌. రేప‌టి రోజు ఆయ‌న మ‌ళ్లీ అటు చూస్తార‌ని కూడా చ‌ర్చలు స్టార్ట్ అయ్యాయి.

Tags:    

Similar News