విస్తరణ జరిగితే….?

మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి దాదాపు నెల రోజులు గడుస్తుంది. అయితే ఇంతవకకూ మంత్రి వర్గ [more]

Update: 2019-12-26 18:29 GMT

మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి దాదాపు నెల రోజులు గడుస్తుంది. అయితే ఇంతవకకూ మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ఉద్ధవ్ థాక్రేతో పాటు మరో ఆరుగురు మాత్రమే మంత్రివర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కూటమిలోని పార్టీల నుంచి వత్తిడి పెరుగుతోంది. మంత్రి వర్గ విస్తరణను వెంటనే చేపట్టాలని ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు.

ఈ నెల 30వ తేదీన….

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణను ఈ నెనల 30వ తేదీన చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ లు చర్చలు జరిపారు. నెల దాటుతున్నా మంత్రి వర్గ విస్తరణ చేపట్టకపోవడం మంచిది కాదని ఉద్ధవ్ థాక్రే ఈ సందర్భంగా పవార్ తో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇందుకు కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే కారణమని తెలిపారు.

ఇద్దరి మధ్య చర్చలు….

ఏ పార్టీ నుంచి ఎంతమంది సభ్యులు మంత్రి వర్గంలో ఉండాలన్న దానిపై ఇద్దరి నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మూడు పార్టీల నేతలు మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రుల విషయం కూడా వీరిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఎన్సీపీకి ఇవ్వాలన్న ఒప్పందం గతంలోనే కోరింది. అయితే ఎన్సీపీ నుంచి డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై మహారాష్ట్రలో జోరుగా చర్చ జరుగుతోంది.

అసంతృప్తి తలెత్తకుండా…..

అయితే డిప్యూటీ ముఖ్యమంత్రిగా తన సోదరుడు కుమారుడు అజిత్ పవార్ ను చేయాలని ఇప్పటికే శరద్ పవార్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు త్వరలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్ లో కూడా మంత్రి పదవుల కోసం లాబీయింగ్ ప్రారంభమయింది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ లో అసంతృప్తి తలెత్తుతుందని బీజేపీ కాచుక్కూర్చుని ఉంది. అయితే అటువంటి అవకాశాలు ఇవ్వకూడదని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించాలని నిర్ణయించారు.

Tags:    

Similar News