ధోని ఒక రోల్ మోడల్
భారత క్రికెట్ లోనే కాదు, క్రీడా రంగంలోనే మహేంద్ర సింగ్ ధోని ఒక రోల్ మోడల్ అని నిస్సందేహంగా పేర్కొనొచ్చు. ధోని జాతీయ క్రికెట్ లో అడుగు [more]
భారత క్రికెట్ లోనే కాదు, క్రీడా రంగంలోనే మహేంద్ర సింగ్ ధోని ఒక రోల్ మోడల్ అని నిస్సందేహంగా పేర్కొనొచ్చు. ధోని జాతీయ క్రికెట్ లో అడుగు [more]
భారత క్రికెట్ లోనే కాదు, క్రీడా రంగంలోనే మహేంద్ర సింగ్ ధోని ఒక రోల్ మోడల్ అని నిస్సందేహంగా పేర్కొనొచ్చు. ధోని జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టక ముందు తరువాత వెనుకబడిన రాష్ట్రం జార్ఖండ్ పేరు తెలిసిన వారే తక్కువ. జార్ఖండ్ రాజధాని రాంచి లో క్రీడాభివృద్ధి కూడా అంతంత మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్ లో ధోని ఉవ్వెత్తున ఎగసి పడ్డాక జార్ఖండ్ రూపు రేఖలే మారిపోయాయి. రాంచి లో ఎక్కడ చూసినా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు వెలిశాయి. విశాలమైన క్రీడా మైదానాలు వందల కోట్ల రూపాయలతో నిర్మాణాలు స్పోర్ట్స్ స్కూల్స్ హాస్టల్స్ నిర్మాణమయ్యాయి.
క్రీడాకారులకు కొండంత ధైర్యం…..
ఒక వ్యక్తి తలుచుకుంటే వ్యవస్థ గా ఎలా మారవొచ్చో అలాగే స్ఫూర్తిగా ఎలా నిలుస్తారో జార్ఖండ్ లోని రాంచి చూసి వచ్చిన ఎవరికైనా అర్ధమైపోతుంది. దేశంలో క్రీడలు అంటే ఢిల్లీ, ముంబాయి, కోల్ కత్తా, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చే క్రీడాకారుల హవానే అందరికి తెలుసు. గ్రామీణ ప్రాంతాలనుంచి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలనుంచి వచ్చి తనదైన ముద్ర వేసిన వారు అతి తక్కువే. ధోని చూపించిన మార్గమే నేటి దేశ యువతకు దిశా, దశా నిర్దేశించాయి. ప్రతిభ ఉండాలే కానీ, సత్తా చాటడంలో అందరికి అవకాశాలు ఉన్నాయనేదాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వినిపించి ఝుళిపించిన ధోని బ్యాట్ క్రీడాకారులు వారు ఏ ఆట ను ఎంచుకున్నా గొప్ప ధైర్యాన్ని నింపింది అనడంలో అతిశయోక్తి లేదు.
లోటు భర్తీ కావడం కష్టమే …
మిస్టర్ కూల్, కెప్టెన్ కూల్ దేశానికే కాదు ప్రపంచ క్రికెట్ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచాడు. ధోని అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికాడు సరే అతని స్థానం భర్తీ అంత ఈజీ కాదన్నది క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అత్యుత్తమ వికెట్ కీపర్ గా, అద్భుత ఫినిషర్ గా, వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రత్యర్థిని చిత్తు చేసే జార్ఖండ్ డైనమెట్ క్రీడా మైదానంలో ఒక పాత్ర కాదు మూడు నాలుగు పాత్రలు ఏకకాలంలో పోషించేవాడు. దీనివల్ల ధోని స్థానంలో కీపర్ గా ఎవరు కుదురుకున్నా మిష్టర్ కూల్ లాగే అన్ని పాత్రలను పోషించే ఛాన్స్ ఉండదు. తనదైన అద్భుత ప్రతిభతో టీం ఇండియా కు టి ట్వంటీ, వన్డే వరల్డ్ కప్ లనే కాదు టెస్ట్ లలో సైతం అభేధ్య జట్టుగా తీర్చిదిద్దాడు ధనా ధన్. అలాంటి డైనమెట్ ఇప్పట్లోనే కాదు ఎప్పటికి దొరకదన్న ఆందోళన భారత క్రీడాభిమానులను వెన్నాడుతుంది. టీం కప్ గెలవగానే ఆ విజయం తనవల్లే అన్నట్లు ఏనాడు ధోని గంతులు వేయలేదు. ఆ కప్ టీం సభ్యులకు ఇచ్చి వారి పక్కన నిలిచి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే వ్యక్తిగా తన గొప్పదనం చెప్పక చెప్పిన ధోని అందరికన్నా విభిన్నం. తన దేశ భక్తిని చాటడంలోనూ ఏ క్రికెటర్ చేయని సాహసాలను కూడా ధోని చేశాడు. ఆర్మీలో ప్యారాచూట్ సెగ్మెంట్ లో చేరడమే కాదు శిక్షణ సైతం తీసుకుని కాశ్మీర్ లో విధులు నిర్వహించి దేశం పట్ల తన ప్రేమ అభిమానాన్ని యువత లో పాదుకొల్పాడు కెప్టెన్ కూల్.
ధోని నిర్ణయాలు విభిన్నమే …
తన ఆటలోనే కాదు తీసుకునే నిర్ణయాల్లోను ధోని విభిన్నంగానే వ్యవహరిస్తాడు. ఎవరు ఊహించని సమయంలోనే టెస్ట్ ల నుంచి తనంత తాను గా ధోని వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్ట్టించాడు. అదే విధంగా వన్డే కెప్టెన్సీ కి రామ్ రామ్ అన్నాడు. అది కూడా ఎవ్వరు ఉహించనివే. ఇప్పుడు అదే జరిగింది. వన్డే ప్రపంచ కప్ ముగిశాక ధోని రిటైర్మెంట్ పై దేశంలో చర్చ మొదలైంది కానీ ఏ ఒక్క నిజమైన క్రీడాభిమాని మిస్టర్ కూల్ మనకి వీడ్కోలు పలకాలని మాత్రం కోరుకోలేదు. అయితే ఎదో ఒక రోజు ఆటకు గుడ్ బై చెప్పాలి తప్పదు. అది ఇంకా ఆడాలని అంతా కోరుకున్నప్పుడే జరగాలని భావించిన ధోని అదే పని చేశాడు. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు చెప్పేశాడు. ధోని అందుకొని విజయం లేదు. అవార్డు లు రివార్డ్ లకు లెక్కేలేదు. ఇక క్రికెట్ లో ఎవరెస్టు శిఖరం అంత ఎత్తు ఎదిగిన ధోని చేయాలిసింది ఈ రంగంలో ఏమి లేదని భావించలేదు తన వెనుక ఉన్న యువ క్రికెటర్ లకు అడ్డు కాకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఫిట్ నెస్ పరంగా ఇప్పటికి టీం ఇండియా లో నెంబర్ వన్ గా ఉన్నా తనకిష్టమైన అంతర్జాతీయ ఆటకు విశ్రాంతి ఇచ్చేశాడు. ఇలా ధోనీ షాక్ ఇచ్చిన గంట వ్యవధిలోనే జార్ఖండ్ డైనమేట్ ను బాగా ఇష్టపడే సురేష్ రైనా కూడా గుడ్ బై కొట్టేయడం గమనార్హం.