ఏపీపై ఆర్ఎస్ఎస్ వ్యూహం.. విస్తరణ సాధ్యమేనా…?
దేశాన్ని హిందూత్వం వైపు నడిపించాలనే ప్రధాన సిద్ధాంతంతో ఏర్పడిన రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బీజేపీకి పునాది. కేంద్రంలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. ఆర్ఎస్ఎస్ [more]
దేశాన్ని హిందూత్వం వైపు నడిపించాలనే ప్రధాన సిద్ధాంతంతో ఏర్పడిన రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బీజేపీకి పునాది. కేంద్రంలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. ఆర్ఎస్ఎస్ [more]
దేశాన్ని హిందూత్వం వైపు నడిపించాలనే ప్రధాన సిద్ధాంతంతో ఏర్పడిన రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బీజేపీకి పునాది. కేంద్రంలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. ఆర్ఎస్ఎస్ దూకుడు పెంచుతుంది. ప్రధానంగా దేశాన్ని హిందూత్వం చేసే క్రమంలో కీలకమైన విషయాల్లో ఎప్పుడూ పైచేయి సాధించే దిశగానే అడుగులు వేస్తుంది. ఇటీవల అయోధ్య రామమందిరం విషయంలోను ఆర్ఎస్ఎస్ పట్టుబట్టి విజయం సాధించింది. ఇక, ఇప్పుడు రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని.. తద్వారా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఆర్ఎస్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
ఏపీలో ఆందోళనల వెనక….?
మరీ ముఖ్యంగా ఏమాత్రం పట్టులేని ఏపీ వంటి రాష్ట్రాలపై ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ దృష్టి పెట్టింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం వెనుక ఆర్ఎస్ఎస్ చక్రం తిప్పిందనేది వాస్తవం. ఆయనకు ఆర్ఎస్ఎస్ తో యువకుడిగా ఉన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి. ఇవే ఆయనకు కీలకమైన పదవి దక్కేలా చేశాయి. ఇక, ఇప్పుడు ఆయన ద్వారా ఏపీలో పాగా వేసేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఆలయాలపై వరుస దాడులను రాజకీయం చేయడం, నిరసనలు, ధర్నాలు చేయడం వెనుక కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది. ఈ విషయాలను హిందువుల్లోకి బలంగా తీసుకువెళ్లి.. హిందువులను రక్షించేది ఆర్ఎస్ఎస్ మాత్రమే అనే భావనను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించింది.
భిన్నమైన వాతావరణం….
అయితే, భిన్నమైన ఆలోచనలు ఉన్న ప్రజలతో నిండిన ఏపీ వంటి రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ వ్యూహాలు ఏమేరకు సక్సెస్ అవుతాయనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే.. గతంలో పార్టీ అధ్యక్షుడిగా చేసిన.. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చారు. కానీ, ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక, తర్వాత పదవులు చేపట్టిన బంగారు లక్ష్మణ్ వంటి నాయకులు (ఉమ్మడి రాష్ట్రం) కేవలం తెలంగాణ పరిధిలో కొంత మేరకు సక్సెస్ అయినా.. ఏపీలో మాత్రం వ్యూహాలను సక్సెస్ చేయలేక పోయారు. మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఆశలు నెరవేరతాయా? అనేది చర్చనీయాంశంగా మారింది.
మతం అజెండాగానే…?
ప్రజల సమస్యలను పట్టించుకుని ఎదగాలని అనుకుంటే అంతో ఇంతో ఎదిగేందుకు మార్జిన్ ఉంటుంది. కానీ, కేవలం మత అజెండాతో ఏపీ వంటి రాష్ట్రంలో ఎదగడం కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. కానీ, ఇప్పటికిప్పుడు ఆర్ఎస్ఎస్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభించడం, మత పరంగా ప్రజలను తన చెంతకు చేర్చుకోవడం, సభ్యత్వాలు, సమావేశాలు పెంచడం, కాలేజీల్లో ఏబీవీపీలను అభివృద్ధి చేసి.. యువతను తనవైపునకు తిప్పుకోవడం వంటివి చేసేందుకుప్రణాళికలు వేస్తోంది. కానీ, అసలు రాజకీయ పార్టీగా బీజేపీనే పట్టించుకోని ఏపీ ప్రజలు.. మతపరమైన ఆర్ఎస్ఎస్ ను అక్కున చేర్చుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.