దీదీ కోరుకుంటున్నదీ అదేగా?

ఏ రాష్ట్రంలో లేని హీట్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరింత పెరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై జరిగిన [more]

Update: 2020-12-12 16:30 GMT

ఏ రాష్ట్రంలో లేని హీట్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరింత పెరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై జరిగిన దాడి ఇప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధిస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే అదే జరిగితే ఎన్నికల వేళ మమత బెనర్జీకి మరింత లాభిస్తుందంటున్నారు విశ్లేషకులు.

నడ్డా కాన్వాయ్ పై….

పశ్చిమ బెంగాల్ లో ఇటీవల పర్యటించిన జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిని తృణమూల్ కాంగ్రెస్ నేతలే చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతోగవర్నర్ థన్ కర్ సయితం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. పశ్చిమ బెంగాల్ లో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ధన్ కర్ తన నివేదికలో పేర్కొన్నారు. మమత బెనర్జీ ప్రభుత్వంపై థన్ కర్ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. నిప్పుతో చెలగాటం వద్దంటూ గవర్నర్ థన్ కర్ హెచ్చరించారు కూడా.

గవర్నర్ వర్సెస్ దీదీ….

గత కొంతకాలంగా గవర్నర్ కు, మమత బెనర్జీ కి మధ్య ప్రత్యక్ష్య యుద్ధమే జరుగుతుంది. థన్ కర్ ను మమత బెనర్జీ బీజేపీ ఏజెంటుగానే చూస్తున్నారు. బీజేపీని రానున్న ఎన్నికల్లో నిలువరించేందుకు మమత బెనర్జీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన జేపీ నడ్డాపై జరిగిన దాడిని తమపై నెట్టి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మమత బెనర్జీ ఆరోపిస్తున్నారు. గవర్నర్ నివేదిక అందగానే కేంద్ర హోంశాఖ ఈనెల 14వతేదీన ఢిల్లీకి రావాలని బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలను ఆదేశించింది.

రాష్ట్రపతి పాలన పెడతారని….

దీనిపై మమత బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను మమత బెనర్జీ లైట్గా తీసుకున్నారు. తాము ఢిల్లీకి రాలేకపోతున్నట్లు ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం, మమత బెనర్జీల మధ్య జరుగుతున్న వార్ ఏ టర్న్ తీసుకుంటుందన్నదీ ఉత్కంఠగా మారింది. అయితే బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పెడతారన్న ఊహాగానాలు మాత్రం చెలరేగుతున్నాయి. ఈనెల 19వతేదీన అమిత్ షా బెంగాల్ పర్యటన ఉంటుందంటున్నారు. ఆ పర్యటన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని ఢిల్లీలో ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News