మమతకే ఎందుకిలా…? నా అనుకున్న వాళ్లే…?
నమ్మకమైన నేతలే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. సానుభూతితో తాను ఇచ్చిన పదవులనుకూడా త్యజించి వెళుతున్నారు. మమత బెనర్జీ లో లోపమా? లేక బీజేపీ వలలో వారు చిక్కకుంటున్నారా? [more]
నమ్మకమైన నేతలే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. సానుభూతితో తాను ఇచ్చిన పదవులనుకూడా త్యజించి వెళుతున్నారు. మమత బెనర్జీ లో లోపమా? లేక బీజేపీ వలలో వారు చిక్కకుంటున్నారా? [more]
నమ్మకమైన నేతలే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. సానుభూతితో తాను ఇచ్చిన పదవులనుకూడా త్యజించి వెళుతున్నారు. మమత బెనర్జీ లో లోపమా? లేక బీజేపీ వలలో వారు చిక్కకుంటున్నారా? అన్నది అర్ధం కాకుండా ఉంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు మమత బెనర్జీకి గట్టి దెబ్బలే తగులుతున్నాయి. నా అనుకున్న వాళ్లే కాదని వెళ్లిపోతున్నారు. మొన్న సువేేందు అధికారి తాజాగా దినిశ్ త్రివేది వీరంతా మమత బెనర్జీ నుంచి ఏదో ఒకరూపంలో లబ్దిపొందిన వారే.
ఎన్నికల ముందు….
కానీ ఎన్నికల సమయానికి హ్యాండిచ్చి వెళ్లిపోతుండటం దీదీలో దిగులు పెంచుతోంది. దినేశ్ త్రివేది సీనియర్ నేత. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి జనతాదళ్ లో చేరారు. 1998లో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ లో ఆయనకు ప్రాధాన్యత బాగానేే ఇచ్చారు. 2019 ఎన్నికలలో లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలు కావడంతో మమత బెనర్జీ వెంటనే ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చారు. ఇంకా ఏడాది కూడా గడవని పదవిని వదలి వెళ్లిపోవడం బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
కార్పొరేట్ శక్తుల చేతుల్లో….
మమత బెనర్జీ కార్పొరేట్ శక్తుల్లో కూరుకుపోయారని విమర్శలు విన్పిస్తున్నాయి. ఆయన ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ను మమత బెనర్జీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న నాటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయే వారి సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. మమత బెనర్జీ ఎక్కువగా ప్రశాంత్ కిషోర్ మీదనే ఆధారపడటం, సీనియర్ నేతల సలహాలు కూడా తీసుకోకపోవడమే పార్టీని వీడటానికి కారణమంటున్నారు.
పీకే వల్లనేనా?
మమత బెనర్జీ పార్టీకి చీఫ్. ఆమె నిర్ణయమే ఫైనల్. అయితే గత రెండు ఎన్నికల్లో మమత బెనర్జీ అలా చేయలేదు. పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకునే వారు. కానీ ఈసారి మాత్రం ఎవరి అభిప్రాయాలు మమతకు అవసరం లేదు. అభ్యర్థుల ఎంపికలోనూ ప్రశాంత్ కిషోర్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందంటున్నారు. దీంతోనే సీినియర్ నేతల్లో అసహనం మొదలయి పార్టీని వీడ వెళుతున్నారన్న టాక్ పార్టీలో విన్పిస్తుంది. ఇప్పటికైనా మమత బెనర్జీ తీరును మార్చుకోకుంటే మరింత మంది నేతలు పార్టీకి దూరం కావడం ఖాయంగా కన్పిస్తుంది.