దగ్గర దారులు వెతుక్కుంటున్న దీదీ
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పీడ్ పెంచారు. ప్రజల ఆదరణను చూరగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీ గట్ట ిపోటీ ఇస్తుండటంతో హ్యాట్రిక్ విజయం [more]
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పీడ్ పెంచారు. ప్రజల ఆదరణను చూరగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీ గట్ట ిపోటీ ఇస్తుండటంతో హ్యాట్రిక్ విజయం [more]
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పీడ్ పెంచారు. ప్రజల ఆదరణను చూరగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీ గట్ట ిపోటీ ఇస్తుండటంతో హ్యాట్రిక్ విజయం కోసం మమత బెనర్జీ అన్ని దారులు వెతుక్కుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను ప్రారంభించారు. తాజాగా మా కిచెన్ లను మమత బెనర్జీ ప్రారంభించారు.
ఐదు రూపాయలకే…..
ఎన్నికల వేళ బెంగాల్ లో ఐదు రూపాయలకే భోజనం పథకాన్ని మమత బెనర్జీ ప్రకటించారు. దీనికి మా కిచెన్ అని నామకరణం చేశారు. మూడు కూరలతో భోజనం అందించనున్నారు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఈ మా కిచెన్ లను ప్రారంభించారు. పేద, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేలా మమత బెనర్జీ ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని తీసుకువచ్చారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ పథకాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
తొలుత నగరాల్లో….
ప్రభుత్వం పదిహేను రూపాయల సబ్సిడీ ఇవ్వనుంది. మా కిచెన్ సెంటర్ల వల్ల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని మమత బెనర్జీ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా పశ్చిమ బెంగాల్ లోని నగరాలు, పట్టణాలకే ఈ పథకాన్ని పరిమతం చేశారు. త్వరలో అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న యోచనలో మమత బెనర్జీ ఉన్నారు. దీనివల్ల తక్కువ ధరకు భోజనం పేదలకు దొరుకుతుందని, తద్వారా ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయంటున్నారు.
అనేక రాష్ట్రాల్లో…..
ఇటువంటి పథకం తొలిసారి తమిళనాడులో అమ్మ క్యాంటిన్ల పేరిట జయలలిత ప్రవేశపెట్టారు. జయలలిత రెండోసారి అధికారంలోకి రావడానికి కారణం అమ్మ క్యాంటిన్లే. ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అన్న క్యాంటిన్ల పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణలోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. అన్ని రాష్ట్రాల్లో విజయవంతం కావడంతో మమత బెనర్జీ బెంగాల్ లోనూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎంతవరకూ ఇది సక్సెస్ అవుతుందో, ఎన్నికల్లో దీదీకి ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి మరి.