దీదీ సూపర్ ఐడియా… హ్యాట్రిక్ వైపు పరుగులు

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మమత బెనర్జీ దూకుడు పెంచారు. బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. లోకల్ నినాదాన్ని మమత బెనర్జీ అందుకోవడంతో బీజేపీ కూడా [more]

Update: 2021-03-05 18:29 GMT

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మమత బెనర్జీ దూకుడు పెంచారు. బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. లోకల్ నినాదాన్ని మమత బెనర్జీ అందుకోవడంతో బీజేపీ కూడా ఇరకాటంలో పడింది. హమారా బంగ్లా నినాదాన్ని మమత బెనర్జీ ఎత్తుకోవడంతో బీజేపీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. గుజారాతీ పార్టీగా మమత బెనర్జీ ప్రతి సభలోనూ బీజేపీని దుయ్య బడుతున్నారు. ఇది మమత బెనర్జీకి కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు.

బీజేపీని బయట పార్టీగా….

మమత బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధించకుండా ఎలాగైనా అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ నేతలను తన పార్టీలోకి చేర్చుకుంది. వారిని బంగ్లా ద్రోహులుగా మమత బెనర్జీ ప్రకటించారు. బయట వ్యక్తుల చేతుల్లోకి పాలన వెళితే రాష్ట్రం బాగుపడదన్న ప్రచారాన్ని మమత బెనర్జీ జోరుగా చేస్తున్నారు. కేవలం కొన్ని రాష్ట్రాలకే బీజేపీ అధినాయకత్వం పట్టించుకుంటుందని, మిగిలిన రాష్ట్రాలను గాలికి వదిలేస్తుందని మమత బెనర్జీ ప్రతి సభలోనూ విమర్శలకు దిగుతున్నారు.

కేంద్ర ప్రభుత్వంపై…..

పెట్రోలో, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచడం కూడా మమత బెనర్జీ కి కలసి వచ్చే అంశంగానే చెప్పాలి. సామాన్య మధ్య తరగతి ప్రజలు పెట్రో భారాన్ని భరించలేకపోతున్నారు. వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు మమత బెనర్జీ మోదీ, షాలను టార్గెట్ చేసుకున్నారు. తాను బెంగాలీనని, బెంగాలీయేతరులకు ఇక్కడ స్థానం లేదని మమత బెనర్జీ గట్టిగానే వార్నింగ్ లు ఇస్తున్నారు. ఢిల్లీ ల రిమోట్ ఉంటుందని, ఢిల్లీ పాలన కావాలా? దీదీ పాలన కావాలా? అని ఆమె ప్రజలను సూటిగా ప్రశ్నిస్తున్నారు.

బంగ్లా నినాదంతో…..

ఈ మధ్య కాలంలో బంగ్లా నినాదాన్ని ఎక్కువగా విన్పించడం వెనక కూడా మమత బెనర్జీ ఆలోచన ఇదేనని అంటున్నారు. జై బంగ్లా అంటూ ఆమె ప్రచారం ముగించే సమయంలో చేయడం ఎత్తుగడలో భాగమే. బయట వ్యక్తులకు ఇక్కడ స్థానం లేదని చెబుతూనే, వారి చేతిలో బెంగాల్ ఇరుక్కుంటే ఇక ఎవరూ రక్షించలేరని ప్రజలకు నూరిపోస్తున్నారు. మొత్తం మీద లోకల్ నినాదంతో మమత బెనర్జీ ముందుకు వెళుతుండటంతో బీజేపీ కొంత ఇబ్బందుల్లో పడిన మాట వాస్తవమే.

Tags:    

Similar News