కమలానికి ఆ ఛాన్స్ కూడా ఇవ్వరట

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ లు పోటాపోటీగా ఉన్నాయి. అయితే ఇప్పటికే బీజేపీ తాను మమత బెనర్జీని బలహీనపర్చానని భావిస్తుంది. [more]

Update: 2021-04-05 17:30 GMT

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ లు పోటాపోటీగా ఉన్నాయి. అయితే ఇప్పటికే బీజేపీ తాను మమత బెనర్జీని బలహీనపర్చానని భావిస్తుంది. ఎక్కువ మంది నేతలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా మానసికంగా మమత బెనర్జీ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ చేరికలు మమత బెనర్జీకి ఎంతమేరకు కలసి వస్తాయన్నదే ప్రశ్నగా వినపడుతుంది.

తాను దెబ్బతీసినట్లుగానే..?

గతంలో వామపక్ష కూటమిని మమత బెనర్జీ ఇలానే దెబ్బతీశారు. ఆమె లెఫ్ట్ పార్టీపై అలుపెరగని పోరాటం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలను ఎక్కువ సంఖ్యలో తనపార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు బీజేపీ సయితం అదే పంథాలో వెళుతుంది. అయితే ఇక్కడ మమత బెనర్జీ బలహీనం కాలేదు. నేతలు వెళ్లిపోయినంత మాత్రాన క్యాడర్, ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదన్న ఆత్మవిశ్వాసంతో మమత బెనర్జీ ఉన్నారు.

ఆ రెండు వీక్ కావడంతో….

నిజానికి బీజేపీకి అంతకు ముందు పశ్చిమ బెంగాల్ లో పెద్దగా బలం లేదు. కమ్యునిస్లుటు, కాంగ్రెస్ పార్టీలు బలహీనం కావడంతో బీజేపీకి పశ్చిమ బెంగాల్ లో రూట్ క్లియర్ అయింది. అందుకే మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాల నుంచి 18 స్థానాలకు ఎగబాకింది. దీంతో ఈ ఎన్నికల సమయంలో మమత బెనర్జీ అప్రమత్తమయ్యారు. ఆ 18 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీపై ప్రత్యేక దృష్టిని పెట్టారు.

వారిద్దరూ బలంగా ఉన్న చోట…..

మరోవైపు కాంగ్రెస్, కమ్యునిస్టులు బలంగా ఉన్న చోట మమత బెనర్జీ తన పార్టీ నుంచి బలహీన మైన అభ్యర్థులను బరిలోకి దించారన్న విమర్శలను కూడా విన్పిస్తున్నాయి. అక్కడ బీజేపీ నెగ్గకూడదనే మమత బెనర్జీ ఈ ఆలోచన చేశారంటున్నారు. ఎన్నికల తర్వాత అవసరమైతే వామపక్షాలు, కాంగ్రెస్ తనకే మద్దతిచ్చే అవకాశాలు ఉండటంతో బీజేపీ నెగ్గకుండా మమత బెనర్జీ ఈ వ్యూహాన్ని ఎంచుకున్నారని తెలిసింది. అయితే అలాంటి స్థానాలు అతి కొద్దిగానే ఉన్నాయంటున్నారు. మరి మమత బీజేపీపై పోరాటం ఎంతవరకూ పనిచేస్తుందో చూడాలి.

Tags:    

Similar News