శివంగి గడ్డం గ్యాంగ్ ను చావు దెబ్బతీశారు

పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు. పరిస్థితులను చూస్తే మమత బెనర్జీ చరిష్మా ఏమాత్రం తగ్గలేదని నిరూపితమయింది. ఎవరూ ఊహించని విధంగా [more]

Update: 2021-05-02 16:30 GMT

పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు. పరిస్థితులను చూస్తే మమత బెనర్జీ చరిష్మా ఏమాత్రం తగ్గలేదని నిరూపితమయింది. ఎవరూ ఊహించని విధంగా మమత బెనర్జీ నమోదు చేసుకున్న విజయం వెనక ఆమె కృషి పట్టుదల కారణమని చెప్పక తప్పదు. ఒంటరి మహిళను కాదని, తనకు బెంగాల్ ప్రజలు అండగా ఉన్నారని మరోసారి మమత బెనర్జీ నిరూపించుకున్నారు. అయితే నందిగ్రామ్ లో ఓటమి చవి చూశారు. కానీ తానే మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని మమత బెనర్జీ చెప్పారు.

ఇంత భారీ విజయాన్ని….

పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ విజయం ఇంతగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. దీనికి కారణం పదేళ్లు అధికారంలో ఉండటమే. ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుందని అందరూ భావించారు. ఇక బీజేపీ మమత బెనర్జీని ఊపిరి సలపనివ్వలేదు. గత పార్లమెంటు ఎన్నికల్ల బీజేపీకి 18 స్థానాలు రావడంతో మొదలుపెట్టిన యుద్ధం మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆపలేదు. మోదీ, అమిత్ , షాలు మమత బెనర్జీని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.2016 లో 211 స్థానాలను కైవసం చేసుకున్న మమత బెనర్జీ ఈసారి దానికి మించిన స్థానాలను సాధించారు.

మానసికంగా దెబ్బతీసేందుకు….

ిఇక మమత బెనర్జీని మానసికంగా దెబ్బతీసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. తనకు నమ్మకమైన నేతలను అనేక మందిని బీజేపీ చేర్చుకోగలిగింది. వరస పెట్టి నేతలు పార్టీని వీడి వెళుతున్న మమత బెనర్జీ మానసికంగా కుంగిపోలేదు. అపరకాళికలా మోదీ, షాలపై గర్జించారు. లోకల్, నాన్ లోకల్ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఎంత మంది నేతలు వెళ్లినా వారికి ప్రత్యామ్నాయంగా వెంటనే ధీటైన నేతలను చూడగలిగారు.

మూడోసారి గెలవడం..?

దీంతో పాటు మమత బెనర్జీ తన ఎన్నికల ప్రచారాన్ని మొత్తాన్ని వీల్ ఛెయిర్ లోనే చేశారు. కాలికి గాయం కావడంతో ఆమె నడవలేకపోతున్నారు. మమత బెనర్జీ అనుకున్నది సాధించారు. తాను బీజేపీని దెబ్బతీయాలనుకున్నారు. దెబ్బతీశారు. అయితే మమత బెనర్జీకి బీజేపీయే ప్రధాన ప్రతిపక్షంగా మారింది. మమత బెనర్జీని గత మూడు సార్లుగా బెంగాలీలు ఆదరించారంటే ఆమె చేస్తున్న అభివృద్ధి మరోసారి ఆమెకు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కేలా చేశాయని చెప్పాలి.

Tags:    

Similar News